ప్రతి స్టార్ హీరో సినీ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్లు ఉంటాయి. ఈ తరం ప్రేక్షకుల్లో చాలామంది ప్రేక్షకులు మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానులు అనే సంగతి తెలిసిందే. చిరంజీవి సినీ కెరీర్ లోని ఇండస్ట్రీ హిట్లలో ఇంద్ర సినిమా ఒకటి కాగా రెండు దశాబ్దాల క్రితం ఈ సినిమా ఏకంగా 30 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాలలో బాలయ్య ఎక్కువగా నటించగా చిరంజీవి ఆ తరహా కథాంశంలో నటించిన మూవీ ఇంద్ర కావడం గమనార్హం.
ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కాదు. ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమా గురించి ఒక సందర్భంలో మాట్లాడుతూ ఈ సినిమా మిగిల్చిన అనుభవాలను జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేనని పేర్కొన్నారు. ఇంద్ర సినిమా షూటింగ్ రోజులు తనకు ఇప్పటికీ గుర్తున్నాయని బి. గోపాల్ తెలిపారు. సాధారణంగా ఆ రోజులలో బ్లాక్ లో 500 రూపాయలు ఖర్చు చేసి టికెట్లు కొనేవారని అయితే ఇంద్ర మూవీకి మాత్రం ఒక్కో టికెట్ 2000 రూపాయలు ఖర్చు చేసి కొన్నారని బి.గోపాల్ తెలిపారు.
చిత్తూరు జిల్లాలోని మదనపల్లి ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఏకంగా 10,000 రూపాయలు ఖర్చు చేసి బ్లాక్ లో ఐదు సినిమా టికెట్లను కొనుగోలు చేసినట్లు బి.గోపాల్ అన్నారు. సాధారణంగా కొత్త సినిమాలు రిలీజైన సమయంలో జనాలను ఎస్సై స్థాయి అధికారులు కంట్రోల్ చేస్తారని అయితే ఇంద్ర మూవీకి ఎస్పీ స్థాయి అధికారులు కంట్రోల్ చేయాల్సి వచ్చిందని ఒక లేడీ ఐపీఎస్ అధికారి చెప్పారని బి.గోపాల్ చెప్పుకొచ్చారు. అప్పట్లో ఇంద్ర మూవీ గురించి ఈ విధంగా వచ్చిన వార్తలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని బి.గోపాల్ కామెంట్లు చేశారు.
ఇంద్ర మూవీలో చిరంజీవి అభినయం గురించి ఎంత చెప్పినా తక్కువేనని బి.గోపాల్ అన్నారు. షాకింగ్ ట్విస్టులతో తెరకెక్కిన ఇంద్ర సినిమా చిరంజీవి కెరీర్ లోని బెస్ట్ సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఈ సినిమాలోని డైలాగ్స్ అప్పట్లో ప్రేక్షకుల చేత విజిల్స్ వేయించాయి. రెండు దశాబ్దాల క్రితమే టికెట్ కు 2,000 రూపాయలు ఖర్చు చేశారంటే చిరంజీవిపై ప్రేక్షకుల్లో ఇంత అభిమానమా? అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.