డైరెక్టర్ బాలచందర్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఎంతోమంది లెజెండరీ నటులను పరిచయం చేసిన దర్శకుడుగా బాలచందర్ పేరు సంపాదించుకున్నారు. మెగాస్టార్ చిరు, జయసుధ, జయప్రద, శ్రీదేవి, నాజర్, ప్రకాష్ రాజ్ వంటి ఎంతోమంది నటీనటులకు సినీ జీవితాన్ని అందించిన దర్శకుడిగా బాలచందర్ వీరి జీవితాలలో నిలిచిపోయారు. ఇకపోతే తమిళ సూపర్ స్టార్ గా కొనసాగుతున్న టువంటి కమల్ హాసన్ రజనీకాంత్ బాలచందర్ దర్శకత్వంలో సుమారు 15 సినిమాల్లో నటించారు.
వీరిద్దరి కాంబినేషన్లో బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన మొట్టమొదటి సినిమా అపూర్వ రాగంగల్. ఈ సినిమా అనంతరం ఈ ముగ్గురి కాంబినేషన్లో 1976 లో ముండ్రు ముడిచ్చు సినిమా తెరకెక్కింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో డైరెక్టర్ బాలచందర్ రజనీకాంత్ కు క్లాస్ పీకినట్టు ఓ సందర్భంలో వెల్లడించారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలచందర్ షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చి బయటకు వెళ్లారు. అప్పటికే ఫుల్ ఫామ్ లో ఉన్నటువంటి కమల్ హాసన్ షూటింగ్ విరామం రావడంతో తన తదుపరి సన్నివేశం కోసం ప్రిపేర్ అవుతున్నారు.
అదే సమయంలో రజనీకాంత్ పక్కకు వెళ్లి సిగరెట్ తాగుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఇది చూసిన దర్శకుడు బాలచందర్ ఇద్దరిని తనవద్దకు పిలిచారు. ఇలా పిలిచిన ఆయన కమల్ హాసన్ ని చూపిస్తూ రజనీకాంత్ ని తిట్టారట. కమల్ హాసన్ ను చూసి నేర్చుకో అతని ఎప్పటికైనా గొప్ప నటుడు అవుతాడు. నీకు జీవితంలో పైకి రావాలని లేదా.. అసలు ఏం అవుదామని అనుకుంటున్నావ్ అని రజనీకాంత్ కు బాగా తిట్టినట్లు ఓ సందర్భంలో వెల్లడించారు.
ఈ విధంగా సినీ కెరీర్లో వెనుకబడిన రజనీకాంత్ ఎవరూ ఊహించని విధంగా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్నారు. ఇలా వీరిద్దరూ గొప్ప నటులు అయిన తర్వాత ఒక వేడుకల్లో పాల్గొనగా అదే వేడుకకు బాలచందర్ గారు ముఖ్య అతిథిగా వచ్చినప్పుడు ఈ విషయం గురించి వెల్లడించారు.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!