Bobby: బాలయ్య అభిమానులకు శుభవార్త చెప్పిన బాబీ.. ఆ సర్ప్రైజ్ అప్పుడేనా?

స్టార్ హీరో బాలకృష్ణ (Balakrishna) ఎక్కువ సంఖ్యలో ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నా ఒక సినిమా పూర్తైన తర్వాతే మరో సినిమాలో నటిస్తున్నారు. బాలయ్య బాబీ ( Bobby ) కాంబో మూవీ షూటింగ్ మొదలై చాలా రోజులు కాగా బాలయ్య ఎన్నికల ప్రచారంతో బిజీ అయ్యి కొన్నిరోజుల పాటు షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం మళ్లీ షూటింగ్ తో బిజీ అయ్యారు. ఇప్పటికే బాలయ్య బాబీ సినిమా నుంచి విడుదలైన రెండు గ్లింప్స్ లకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Bobby

అయితే ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయకపోవడం విషయంలో బాలయ్య అభిమానులు ఒకింత అసంతృప్తితో ఉన్నారు. ఆ అసంతృప్తికి చెక్ పెట్టేలా బాబీ సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. ఈ సినిమాలోని కీలక సన్నివేశాలను జైపూర్ షెడ్యూల్ లో పూర్తి చేశామని బాబీ పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి టైటిల్ టీజర్ రిలీజ్ కానుందని బాబీ చెప్పుకొచ్చారు.

టైటిల్ టీజర్ లో రిలీజ్ డేట్ కు సంబంధించిన స్పష్టత కూడా ఉండాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీరమాస్ అనే టైటిల్ తో పాటు ఈ సినిమాకు మరికొన్ని క్రేజీ టైటిల్స్ సైతం వినిపిస్తుండగా ఈ టైటిల్స్ లో ఏ టైటిల్ ఫైనల్ అవుతుందో చూడాల్సి ఉంది. బాలయ్య బాబీ కాంబో మూవీ సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ నెలాఖరు లోపు బాలయ్య బాబీ మూవీ టైటిల్ టీజర్ రిలీజయ్యే ఛాన్స్ అయితే ఉంది.

వరుసగా బాలయ్య సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న థమన్ (S.S.Thaman) ఈ సినిమాకు సైతం మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. బాలయ్య సీనియర్ హీరోలలో రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారు. బాలయ్య ఈ సినిమా తర్వాత అఖండ2 (Akhanda)  సినిమాకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా బాలయ్య కెరీర్ ప్లానింగ్ ఉందని సమాచారం అందుతోంది.

రాజాసాబ్ కోసం ఇండియాలోనే అతిపెద్ద సెట్.. డిలే ఉండదని చెబుతూ?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus