టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్..ని ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) విడుదలయ్యాక బాలయ్య ఫ్యాన్స్ అంతా నందమూరి తమన్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ‘అఖండ’ (Akhanda) నుండి బాలకృష్ణ చేసిన ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) వంటి సినిమాలకు కూడా తమనే (S.S.Thaman) సంగీత దర్శకుడు. అన్ని సినిమాలకి తమన్ బీజీఎం అదరగొట్టేశాడు. ‘డాకు మహారాజ్’ కి కూడా పాటల కంటే ఎక్కువగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్ అయ్యింది. అందుకే అభిమానులు తమన్ కి నందమూరి ట్యాగ్ తగిలించారు.
ఈ విషయం బాలయ్య వరకు వెళ్ళింది. దీంతో తమన్ కి ‘ఎన్.బి.కె’ తమన్ అంటూ పేరు మార్చాడు బాలయ్య. ఎన్.బి.కె అంటే నందమూరి బాలకృష్ణ అనే సంగతి తెలిసిందే. ఇక తమన్ కి బాలయ్య పేరు మార్చడం పై దర్శకుడు బాబీ (K. S. Ravindra) కూడా స్పందించాడు. నిన్న అనంతపూర్లో జరిగిన ‘డాకు మహారాజ్’ సక్సెస్ మీట్లో బాబీ (Bobby) మాట్లాడుతూ.. “విశ్వవిఖ్యాత శ్రీ నందమూరి తారకరామారావు గారి ఇంటి పేరు రావడం అంటే మామూలు విషయం కాదు తమన్.
బాలకృష్ణ గారికి ఇంకో 2,3 హిట్లు ఇచ్చి నేను కూడా ‘నందమూరి’ ఇంటి పేరు వచ్చేలా చేసుకుంటా. బాలకృష్ణ గారు ఫిల్టర్లు లేని వ్యక్తి. నేను చిరంజీవి (Chiranjeevi) అభిమానిని అని చెప్పినా బాలయ్య నన్ను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. మా నాన్నగారు కూడా బాలయ్య గారిలాగే ఫిల్టర్లు లేని వ్యక్తి. ఈరోజు మా నాన్నగారు కనుక ఉంటే చాలా ఆనందపడేవారు” అంటూ చెప్పుకొచ్చాడు.