సినీ ఇండస్ట్రీలో విషాదాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడం లేదు. గద్దర్ మరణించిన 24 గంటల్లోనే తమిళ నటి సింధు క్యాన్సర్ తో మరణించింది.. ఆ వెంటనే కన్నడ నటుడు విజయ్ భార్య స్పందన గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. హాలీవుడ్ దర్శకుడు కిన్ కూడా మరణించడం జరిగింది. అంతేకాదు మలయాళ సినీ పరిశ్రమకు చెందిన దర్శకుడు సిద్ధిఖీ కూడా గుండెపోటు కారణంగా మరణించారు. ఈ విషాదాల నుండి కోలుకోకుండానే మరో విషాదకరమైన వార్త వినాల్సి వచ్చింది.
మలయాళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..అసిస్టెంట్ డైరెక్టర్ బాబీ మోహన్ బుధవారం నాడు మరణించడం జరిగింది. ఆయన వయసు కేవలం 45 సంవత్సరాలే కావడం గమనార్హం. కోజికోడ్‌కు చెందిన బాబీ మోహన్ సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్నాడు. ‘జ్వాలయాయి’కి అనే టెలివిజన్ సీరియల్ కి ఇతను అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. దీనికి వాయలార్ మాధవన్ కుట్టి దర్శకుడు.
బుల్లితెరపై (Director) బాబీ మోహన్ కి మంచి పేరుంది. ఇతను చాలా సీరియల్స్ కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. మలయాళం, తమిళ భాషల్లోని పలు సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. మరోపక్క ఇతను షార్ట్ ఫిల్మ్‌లు, ఆల్బమ్‌లు, ప్రకటనలకు కూడా దర్శకత్వం వహించిన సందర్భాలు ఉన్నాయి. బాబీ మోహన్ ఫ్యామిలీ విషయానికి వస్తే అతనికి..
తల్లి ప్రభ, భార్య నయన, కూతురు ఒలివియా, సోదరి శ్రుతి ఉన్నారని సమాచారం. ఇంకొన్నాళ్ళు ఉంటే ఇతను ఇంకొంచెం పెద్ద స్థాయికి ఎదిగే వాడేమో అని ఇతని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొందరు సినీ ప్రముఖులు ఇతని మరణానికి చింతిస్తూ సానుభూతి తెలుపుతున్నారు.