టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను తక్కువ సినిమాలనే తెరకెక్కించినా ఆ సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్నారనే సంగతి తెలిసిందే. భద్ర సినిమాతో దర్శకునిగా బోయపాటి శ్రీను కెరీర్ మొదలైంది. తులసి, సింహా విజయాలతో బోయపాటి శ్రీను మార్కెట్ మరింత పెరిగింది. దమ్ము ఫ్లాపైనా లెజెండ్, సరైనోడు సినిమాలతో బోయపాటి శ్రీను రేంజ్ మరింత పెరిగింది. అఖండ సినిమాతో బోయపాటి శ్రీను కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నారు.
అయితే ఈ సినిమా సక్సెస్ తర్వాత బోయపాటి శ్రీను తన రెమ్యునరేషన్ ను పెంచేశారని తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉందని బోగట్టా. రామ్ సినిమా కోసం బోయపాటి శ్రీను కూడా ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు హీరో రామ్ రెమ్యునరేషన్ కూడా 20 కోట్ల రూపాయలు కావడం గమనార్హం. సినిమా మొదలుకాకముందే ఈ సినిమా బడ్జెట్ కోసం ఏకంగా 40 కోట్ల రూపాయలు ఖర్చవుతుందంటే
ఈ సినిమా బడ్జెట్ సులువుగా 80 కోట్ల రూపాయలు దాటేస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. రామ్ నటించిన ది వారియర్ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా వల్ల నిర్మాతకు నష్టాలు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. లింగుస్వామి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.
రామ్ తర్వాత ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వరుసగా స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటిస్తున్న రామ్ కు తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ దక్కుతుందో లేదో చూడాల్సి ఉంది.