సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు… ఈ మాట విని చాలామంది డైరక్టర్ – అసిస్టెంట్ డైరక్టర్ కదా అందుకేనేమో అనుకుంటారు. అయితే వారి గురు -శిష్యరికం ఇప్పటిది కాదు అనే విషయం కొంతమందికి తెలిసిందే. సినిమాల్లోకి రాకముందు సుకుమార్ లెక్కల మాస్టారు అనే విషయం తెలిసే ఉంటుంది. బుచ్చిబాబుకు సుకుమార్ ఇంటర్మీడియట్‌లో గణితం బోధించేవారట. అలా సుక్కుకి బుచ్చిబాబు గురువు. ఆ తర్వాత సుకుమార్ దగ్గర దర్శకత్వ శాఖలో చేరి మళ్లీ శిష్యుడయ్యారు బుచ్చిబాబు.
డిగ్రీ పూర్తిచేసిన బుచ్చిబాబు తొలుత… సుకుమార్ దగ్గరకు వచ్చారట. ‘మీ అసిస్టెంటుగా చేరాలంటే ఏం చేయాలి? అని అడిగారట బుచ్చిబాబు. దానికి ఆయన… ‘ఎంబీఏ చదివి రా’ అన్నారట. ఆయన మాట ప్రకారం ఎంబీఏ అయ్యాక సినిమాల్లోకి వచ్చారట బుచ్చిబాబు. ‘100 % లవ్’ నుండి అసిస్టెంటుగా చేరిపోయారు. ‘నాన్నకు ప్రేమతో’, ‘1 నేనొక్కడినే’, ‘రంగస్థలం’ సినిమాలకు పని చేశారు బుచ్చిబాబు. సినిమాలకు పని చేసే సమయంలో సినిమాలకు సంబంధించి ఏదైనా అనుమానం వస్తే…
‘ఈ షాట్ ఎందుకు’ అని అడిగేవారట బుచ్చిబాబు. దానికి సుకుమార్… చాలా ఓపిగ్గా సమాధానం చెప్పేవారట. ఒక్కోసారి సినిమా షూటింగ్ ఆపేసి మరి వివరించేవారట. వ్యక్తిగత జీవితంలోనూ సుకుమార్‌ని 99 శాతం ఫాలో అయిపోతుంటారట బుచ్చిబాబు.
Most Recommended Video
బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
ఈ 15 సినిమాలకి సంగీతం ఒకరు.. నేపధ్య సంగీతం మరొకరు..!