Buchi Babu, NTR: ఎన్టీఆర్‌ మూవీ లైనప్‌ ఇదే.. నో డౌట్!

‘ఉప్పెన’ సినిమా వచ్చి చాలా రోజులైంది. ఆ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన వైష్ణవ్‌తేజ్‌, కృతి శెట్టి తర్వాతి సినిమాలకు సంతకాలు పెట్టి, షూటింగ్‌లు కూడా మొదలెట్టేశారు. ఆ సినిమాలో నటించిన అందరూ తర్వాతి సినిమా పనుల్లోకి దిగిపోయారు. కానీ దర్శకుడు బుచ్చిబాబు మాత్రం కొత్త సినిమా మొదలుపెట్టలేదు. అలా అని బుచ్చిబాబుకు సినిమాతో మంచి పేరు రాలేదా అంటే బాగానే వచ్చింది. అగ్ర హీరోలంతా మెచ్చుకున్నారు. దీంతో ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు వరుస సినిమాలు ఓకే చేసుకుంటాడేమో అనుకున్నారు.

అనుకున్నట్లు తన దగ్గర సిద్ధంగా ఉన్న కథల్ని, పాయింట్లను కొంతమంది చెప్పాడు. వాళ్లు దాదాపు ఓకే చేశారు అని కూడా అన్నారు. అలాంటి హీరోల్లో ఎన్టీఆర్‌ ఒకరు. తారక్‌కి, బుచ్చిబాబుకు మంచి అనుబంధం ఉంది. దీంతో ఎన్టీఆర్‌ కథ ఓకే చేస్తారు, బుచ్చిబాబు తర్వాతి సినిమా ఇదే అవుతుంది అనుకున్నారు. కానీ అవ్వలేదు. ఇప్పుడు తారక్‌ మాటలు చూస్తుంటే తర్వాత కూడా అయ్యేలా లేదు. తారక్‌ ఇటీవల ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ తన సినిమాల లైనప్‌ చెప్పుకొచ్చారు.

అందులో కొరటాల శివ సినిమా, కేజీఎఫ్‌ స్టార్‌ ప్రశాంత్‌ నీల్‌ సినిమా మాత్రమే ఉన్నాయి. ఈ రెండు సినిమాలు పూర్తవ్వడానికి దాదాపు రెండేళ్లు పడుతుంది. అంటే ఇంత త్వరలో బుచ్చిబాబు – తారక్‌ కాంబో చూడటం కష్టమే. అప్పటికి ఏమవుతుందో ఇప్పుడే ఊహించి చెప్పలేం కూడా. సో ఎన్టీఆర్… ‘సారీ బుచ్చిబాబు’ అన్నట్లే కదా.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus