Chandoo Mondeti: చైతు ప్లాప్ సినిమాపై ‘కార్తికేయ2’ డైరెక్టర్ కామెంట్స్!

2014లో ‘కార్తికేయ’ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి దర్శకుడిగా తన కెరీర్ మొదలుపెట్టారు చందు మొండేటి. ఆ తరువాత ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’, ‘బ్లడీ మేరీ’ వంటి సినిమాలను రూపొందించారు. తాజాగా ‘కార్తికేయ2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. రిలీజ్ డేట్ విషయంలో ఈ సినిమా పలుమార్లు వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఫైనల్ గా ఆగస్టు 13న సినిమా విడుదలైంది. లేట్ గా రిలీజైనా.. మంచి హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

సినిమాను కొన్న బయ్యర్లంతా చాలా హ్యాపీగా ఉన్నారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా సత్తా చాటుతోంది. దీంతో అక్కడ కూడా చిత్రబృందం జోరుగా ప్రమోట్ చేస్తుంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు దర్శకుడు చందు మొండేటి. ఇందులో భాగంగా చైతు సినిమా ప్లాప్ అవుతుందనే విషయం తనకు ముందే తెలుసని అన్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. చందు మొండేటి డైరెక్ట్ చేసిన సినిమాల్లో నాగచైతన్య ‘సవ్యసాచి’ సినిమా ఒకటి.

అంతకముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘ప్రేమమ్’ సినిమా మంచి సక్సెస్ కావడంతో ‘సవ్యసాచి’పై బజ్ పెరిగింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. ఈ సినిమా రిజల్ట్ తనకు ముందే అర్థమైందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు చందు మొండేటి. ‘సవ్యసాచి’ సినిమా విషయంలో దర్శకుడిగా చాలా బాధేసిందని..

సినిమా విడుదలకు ఐదు రోజుల ముందే తనకు రిజల్ట్ అర్థమైందని చెప్పారు. సినిమా తను అనుకున్న మార్క్ లో రాలేదని.. అయితే సినిమా రిలీజ్ తరువాత ఏదైనా జరిగి సినిమా హిట్ అయితే బాగుంటుందనిపించిందని అన్నారు. సినిమా స్క్రిప్ట్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యానని.. అందుకే తప్పు జరిగిందని తెలిపారు.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus