Chandoo Mondeti: తన సినిమా ఫలితంపై చందు మొండేటి!

సినిమా విడుదలకు ముందు ‘మా సినిమా అదిరిపోయింది, బాగా వచ్చింది, హిట్‌ పక్కా’ అని రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు దర్శకనిర్మాతలు, హీరో హీరోయిన్లు. అయితే థియేటర్‌లోకి సినిమా వచ్చాక చూస్తే ‘ఇదేంటి ఇలా ఉంది’ అని అనుకుంటారు. దాంతోపాటు ఈ మాత్రం విషయం కూడా వాళ్లకు తెలియదా? అస్సలు బాగాలేని సినిమాను అద్భుతంగా అని ఎలా చెప్పారు అనే ప్రశ్న ప్రేక్షకుల్లో వస్తుంది. అయితే, ఆ సినిమా ఫలితం అప్పటికే టీమ్‌కి తెలిసిపోయి ఉంటుంది. అచ్చంగా ఇలానే ‘సవ్యసాచి’ సినిమా ఫలితాన్ని ముందే తెలుసుకున్నారు దర్శకుడు చందు మొండేటి.

చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన ‘కార్తికేయ 2’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఆగస్టు 13న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో చందు మొండేటి మీడియాతో మాట్లాడుతూ తన పాత సినిమా ‘సవ్యసాచి’ ఫలితం గురించి స్పందించాడు. నాగచైతన్య హీరోగా భారీ అంచనాలతో వచ్చిన ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఆ సినిమా తర్వాత అతని కెరీర్‌లో గ్యాప్ కూడా వచ్చింది. ఆ సినిమా విషయంలో కన్‌ఫ్యూజ్‌ అయినట్లు చందు చెప్పారు.

‘సవ్యసాచి’ సినిమానుక కన్విక్షన్‌తో చేయలేకపోయానని, ఏం చేస్తున్నాననే విషయంలో తనకు తాను కన్‌ఫ్యూజ్‌ అయిపోయానని చందు తెలిపారు. దాంతోనే సినిమా ఫలితం తేడా కొట్టిందని చెప్పారు. అంతేకాదు సినిమా విడుదలకు ఐదు రోజుల ముందే తనకు రిజల్ట్ తెలిసిపోయిందని వెల్లడించారు. సినిమా చూసుకుంటే నాకే నచ్చలేదు, ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయినా దాని క్రెడిట్ మనం తీసుకోకూడదు అని తన అసిస్టెంట్లతో చందు అన్నారట.

ఏదైనా సినిమా విషయంలో తప్పు చేయడం మొదలైతే.. ఆ తర్వాత అన్నీ తప్పుగానే అవుతాయన్న చందు మొండేటి… ‘సవ్యసాచి’ సినిమా విషయంలో ఇదే జరిగిందని చెప్పారు. సినిమా బేసిక్ ఐడియా, మాధవన్ పాత్ర ఇలా అన్నీ తేడా కొట్టాయని చందు చెప్పారు. అంతేకాదు తన కెరీర్‌లో ఓవర్‌ బడ్జెట్‌ సినిమా ఇదని, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి మంచి బ్యానర్ ఉన్నా, కావాల్సిందల్లా సమకూర్చినా మంచి సినిమా చేయలేకపోయానని చందు నాటి రోజుల్ని గుర్తు చేసుకున్నారు.

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus