Naga Chaitanya: ముచ్చటగా మూడోసారి చందు మొండేటికి అవకాశం ఇచ్చిన చైతూ!

అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన కృతి శెట్టి నటించారు. ఇక ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ఒకేసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నారు. ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నారన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈయన ముచ్చటగా మూడోసారి డైరెక్టర్ చందు మొండేటికీ అవకాశం ఇవ్వబోతున్నారని ఆయన డైరెక్షన్లోనే నాగచైతన్య తన తదుపరి సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.

గత ఏడాది నిఖిల్ అనుపమ హీరో హీరోయిన్లుగా నటించిన కార్తికేయ2 సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య తదుపరి సినిమా చేయబోతున్నారని సమాచారం. అయితే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో ప్రేమమ్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే సవ్యసాచి సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రేమమ్ పరవాలేదు అనిపించుకున్న సవ్యసాచి మాత్రం కాస్త నిరాశను కలిగించిందని చెప్పాలి.

ఇక తాజాగా (Naga Chaitanya) నాగచైతన్య మరోసారి డైరెక్టర్ చందు మొండేటికే అవకాశం ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. ఇక చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా రాబోతుందని సమాచారం ఇక నాగచైతన్య ఇదివరకే గీత ఆర్ట్స్ బ్యానర్లో తమన్నాతో కలిసి 100%లవ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. తిరిగి ఈ బ్యానర్ లో నాగచైతన్య మరోసారి సినిమా చేయబోతున్నారని తెలుస్తోంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus