అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) లైనప్ ఎప్పుడూ ఆకర్షించే విధంగా ఉంటుంది. ఈసారి అతని లైనప్స్ చూస్తుంటే… అతను మరింత మెచ్యూర్డ్ గా వ్యవహరిస్తున్నట్టు కూడా స్పష్టమవుతుంది. ‘థాంక్యూ’ (Thank You) ‘కస్టడీ’ (Custody) వంటి ప్లాప్స్ పడినప్పుడు ‘దూత’ (Dhootha) వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అందులో చైతన్య పెర్ఫార్మన్స్ కూడా అదిరిపోయింది. ఓటీటీ చరిత్రలో అత్యధిక వ్యూయర్ షిప్ నమోదు చేసిన వెబ్ సిరీస్..గా ‘దూత’ ఆ టైంకి చరిత్ర సృష్టించింది.
అటు తర్వాత అతను ‘తండేల్’ (Thandel) చేశాడు. ఇది యావరేజ్ సినిమానే.. కానీ చైతన్య, సాయి పల్లవి (Sai Pallavi)..ల కాంబోకి ఉన్న క్రేజ్ అలాగే ముందుగా పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడం వంటివి బాగా కలిసొచ్చి.. బాక్సాఫీస్ వద్ద రూ.85 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ముఖ్యంగా ఇందులో సాయి పల్లవి కంటే కూడా చైతన్య పెర్ఫార్మన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. అది ప్రత్యేకంగా చెప్పుకోవాలి.
ఇక ‘తండేల్’ తర్వాత నాగ చైతన్య తన 24వ సినిమాని ‘విరూపాక్ష’ (Virupaksha) దర్శకుడు కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది మిస్టికల్ థ్రిల్లర్ అని టీం ముందుగానే చెప్పింది.ఆల్రెడీ రెండు షెడ్యూల్స్ కూడా ఫినిష్ అయ్యాయి. దీంతో చైతన్య తన భార్య శోభితతో (Sobhita Dhulipala) వెకేషన్ కి వెళ్ళాడు. తర్వాత 3 వ షెడ్యూల్లో జాయిన్ అవుతాడు.
మరోపక్క అతను తన 25 వ ప్రాజెక్టును కూడా సెట్ చేసుకున్నాడు. అందుతున్న సమాచారం ప్రకారం.. కిషోర్ అనే కొత్త దర్శకుడితో తన ల్యాండ్ మార్క్ సినిమా చేయబోతున్నాడు చైతన్య. ‘ఆర్కా మీడియా’ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. రానా కో- ప్రొడ్యూసర్ గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా క్రేజీ ప్రాజెక్ట్ అనే చెప్పాలి.