తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక హీరో హీరోయిన్ లేదా దర్శకుడు హీరోయిన్ కలిసి వరుసగా రెండు మూడు సినిమాలలో నటిస్తేవారి గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతాయి. అలాంటిది ఒక డైరెక్టర్ ఏకంగా హీరోయిన్ కి వేదికపైనే ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేస్తే వారి గురించి వచ్చే గాసిప్స్ కు అడ్డు ఉండదని చెప్పాలి. అయితే ఇలాగే వార్తలలో నిలిచారు డైరెక్టర్ గోపీచంద్ మలినేని నటి శృతిహాసన్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో శృతిహాసన్ ఏకంగా మూడు సినిమాలలో నటించి మూడు అద్భుతమైన విజయాలను అందుకున్నారు.
ఇలా గోపీచంద్ తాజాగా బాలకృష్ణ శృతిహాసన్ హీరో హీరోయిన్లుగా వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా కార్యక్రమాలలో భాగంగా ఈయన వేదికపై శృతిహాసన్ కు ఐ లవ్ యు చెప్పడంతో ఈ విషయం కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈయన ఏ ఉద్దేశంతో తనకు ఐ లవ్ యు చెప్పారో శృతిహాసన్ వివరించారు. ఇలా గోపీచంద్ తనకు అన్నయ్య లాంటి వాడని ఈమె వేదికపై చెప్పినప్పటికీ నేటిజన్స్ మాత్రం దారుణంగా వీరిని ట్రోల్ చేస్తున్నారు.
అయితే వీరి గురించి పెద్ద ఎత్తున మీమ్స్ కూడా రావడం విశేషం. అయితే ఈ ట్రోల్స్, మీమ్స్ పై స్పందించిన గోపీచంద్ తనకు శృతిహాసన్ కు మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో చెప్పేసారు.శృతిహాసన్ తనకు ఇష్టమైన హీరోయిన్ అని చెప్పిన ఈయన తన మూడు సినిమాలలో ఆమె నటించారని అయితే తనతో బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఉందని ఈ సందర్భంగా గోపీచంద్ తెలిపారు.ఇలా మా మధ్య బ్రదర్ సిస్టర్ బాండింగ్ ఉందని
ఈ ఉద్దేశంతోనే తనకు ఐ లవ్ యు చెప్పానే తప్ప కొందరు మాత్రం మా ఇద్దరి మధ్య ఒక అబ్బాయి అమ్మాయి మధ్య ఉన్న బాండింగ్ క్రియేట్ చేసి ట్రోల్ చేయడమే కాకుండా మీమ్స్ కూడా క్రియేట్ చేస్తున్నారని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ మీమ్స్ చూసిన తర్వాత నేను శృతిహాసన్ బాగా నవ్వుకున్నామని గోపీచంద్ తన గురించి వచ్చిన లవ్ ట్రోల్స్ పై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?