Jr NTR: ఎన్టీఆర్ సాంగ్ లేకపోతే ఎలా.. హరీష్ శంకర్ ఏమన్నారంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాల రామాయణం సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు నటుడిగా అంతకంతకూ ఎదుగుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమాలో తారక్ అద్భుతమైన నటనకు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ప్రశంసలు దక్కాయి. చరణ్, తారక్ తమ పాత్రలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగా కొమురం భీముడో సాంగ్ లో తారక్ ఎక్స్ ప్రెషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని కామెంట్లు వ్యక్తమయ్యాయి. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీలో డ్యాన్స్ ఐకాన్ పేరుతో ఒక షో ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.

హరీష్ శంకర్ జడ్జిగా హాజరైన ఈ షోకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హరీష్ శంకర్ డ్యాన్స్ ఐకాన్ అని పేరు పెట్టి ఎన్టీఆర్ సాంగ్ లేకపోతే ఎలా అని చెప్పగా ఆ తర్వాత టెంపర్ సినిమాలోని టైటిల్ సాంగ్ ప్లే కావడం కంటెస్టెంట్లు డ్యాన్స్ చేయడం గమనార్హం. తారక్ క్రేజ్ కు నిదర్శనం ఇదేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తారక్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాతగా రామయ్యా వస్తావయ్యా సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఫస్టాఫ్ బాగానే ఉన్నా సెకండాఫ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకోవడం గమనార్హం. నిర్మాత దిల్ రాజుకు మాత్రం ఈ సినిమా వల్ల నష్టాలు తక్కువగానే వచ్చాయి. జూనియర్ ఎన్టీఆర్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి రుణం తీర్చుకోవాలని హరీష్ శంకర్ భావిస్తుండగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా వస్తుందో లేదో చూడాల్సి ఉంది.

హరీష్ శంకర్ తర్వాత సినిమా పవన్ హీరోగా తెరకెక్కనుండగా ఈ ప్రాజెక్ట్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి. తారక్ హరీష్ కాంబో రాబోయే రోజుల్లో రిపీట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామయ్యా వస్తావయ్యా సినిమా కమర్షియల్ గా ఫ్లాపైనా మాస్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చింది.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus