షూటింగ్ జరుగుతున్న లొకేషన్ లేదా సెట్ ఎక్కడికి వెళ్ళినా హడావిడి హడావిడిగా వుంటుంది. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా వుంటారు. షాట్‌కి, షాట్‌కి మధ్య గ్యాప్‌లో కెమెరా డిపార్ట్‌మెంట్ వాళ్ళ నెక్ట్స్ తియ్యబోయే షాట్‌కి రెడీ అవుతుంటే… సెట్ డిపార్ట్‌మెంట్ సెట్ వర్క్ చూసుకుంటారు. ఓ విధమైన హడావిడి వుంటుంది. అటువంటి సెట్‌లోకి ఒక్కసారి పవన్‌కల్యాణ్ ఎంటరైతే అందరూ సైలెంట్ అయిపోతారని డైరెక్టర్ హరీష్ శంకర్ చెప్తున్నారు. మరోసారి ఆది ఎక్స్‌పీరియన్స్ చెయ్యడానికి ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని ఆయన తెలియజేశారు.
పవన్ కల్యాణ్‌కి హరీష్ శంకర్ వీరాభిమాని. ‘గబ్బర్ సింగ్’ ఆడియో ఫంక్షన్‌లో కట్టే కాలే వరకూ పవన్ అభిమానిగా వుంటానని చెప్పుకొచ్చారు. పవర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకున్నట్టు పవన్‌ని చూపించి ‘గబ్బర్ సింగ్’తో బ్లాక్‌బస్టర్ కొట్టారు. ఎయిట్ ఇయర్స్ తరవాత మళ్ళీ పవన్‌ని డైరెక్షన్ చేసే ఛాన్స్ అందుకున్నారు. ‘వకీల్ సాబ్’, క్రిష్ డైరెక్షన్‌లో పవన్ చేస్తున్న సినిమా కంప్లీట్ అయ్యాక, హరీష్ డైరెక్షన్‌లో పవన్ సిన్మా చెయ్యనున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఆ సినిమా స్ర్కిప్ట్ వర్క్‌లో హరీష్ బిజీగా వున్నారు.
‘గబ్బర్ సింగ్’లో ఎంటర్‌టైన్‌మెంట్, హీరోయిజమ్ మీద హరీష్ శంకర్ కాన్సంట్రేట్ చేశాడు. ఈసారి జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వుండదని ఆల్రెడీ హింట్ ఇచ్చారు. పవన్ పొలిటికల్ ఇమేజ్‌కి సంబంధించి స్టోరీలో ఏదైనా వుంటుందో లేదో ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుందని హరీష్ అన్నారు. పవర్‌స్టార్ క్యారెక్టరైజేషన్, సినిమా ఫ్యాన్స్‌కి ట్రీట్‌లా వుంటాయని ఆయన హమీ ఇస్తున్నారు.
Most Recommended Video
బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!