Harish Shankar: హరీష్ శంకర్ చెప్పిన ఆ కథను రామ్ రిజెక్ట్ చేశారా?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన హరీష్ శంకర్ (Harish Shankar)  మిస్టర్ బచ్చన్ (Mr Bachchan) సినిమా విషయంలో వచ్చిన మిక్స్డ్ టాక్ గురించి స్పందిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ తనకు కొత్త కాదని అదే సమయంలో సోషల్ మీడియా మాత్రమే నాకు జీవితం కాదని అన్నారు. గతంలో రవితేజ (Ravi Teja)  సినిమాలకు వచ్చిన రెస్పాన్స్ నన్ను నిరాశకు గురి చేసిందని అయితే ఆ దర్శకులపై జరగని అటాక్ నాపై జరిగిందని హరీష్ పేర్కొన్నారు. నన్ను టార్గెట్ చేస్తూ కొంతమంది కావాలని మిస్టర్ బచ్చన్ సినిమాకు నెగిటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారని హరీష్ శంకర్ తెలిపారు.

Harish Shankar

మిస్టర్ బచ్చన్ సినిమాలో ఉన్న మంచి డైలాగ్స్ గురించి పట్టించుకోవడం లేదని ఆయన తెలిపారు. రవితేజ సొంత అన్నయ్యలా ఉంటారని ఏ విషయాన్ని రవితేజ సీరియస్ గా తీసుకోరని హరీష్ శంకర్ వెల్లడించారు. రామ్ పోతినేనితో (Ram)  సినిమా గురించి మాట్లాడుతూ హరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్టార్ హీరో రామ్ ను తాను చాలా సందర్భాల్లో కలవడం జరిగిందని సినిమాల విషయంలో రామ్ కు ఉన్న అంకిత భావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదని హరీష్ పేర్కొన్నారు.

రామ్ డబుల్ ఇస్మార్ట్ (Double Ismart)  మూవీ కొరకు కేవలం రెండు వారాల్లో బరువు తగ్గాడని ఆయన చెప్పుకొచ్చారు. రామ్ కు మొదట ఇద్దరు హీరోలు ఉండే కథ చెప్పానని అందులో ఒక పాత్రకు ఫైటింగ్ ఉండదని చెంపదెబ్బ కూడా ఉండదని హరీష్ పేర్కొన్నారు. ఆ కథను రామ్ విన్న తర్వాత మనిద్దరం సినిమా చేస్తే ఫ్యాన్ ఐదులో తిరగాలని ఇది రెండులో తిరుగుతుందేమో అని అన్నాడని ఆయన కామెంట్లు చేశారు.

ఐదులో తిరిగే కథ తీస్తానని రామ్ కు చెప్పానని త్వరలోనే ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని హరీష్ శంకర్ తెలిపారు. త్రివిక్రమ్ (Trivikram) అంటే నాకు చాలా గౌరవం టాలీవుడ్ ఇండస్ట్రీలో రైటర్ గా త్రివిక్రమ్ మార్క్ శాశ్వతం అని హరీష్ శంకర్ తెలిపారు.

ఉస్తాద్ భగత్ సింగ్ విషయంలో పవన్ ఫ్యాన్స్ కు ఆ టెన్షన్ అక్కర్లేదా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus