Harish Shankar, Ravi Teja: నేనీ స్థానంలో ఉన్నానంటే అందుకు కారణం రవితేజనే.. హరీష్ శంకర్ ఎమోషనల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్ గా చిన్న చిన్న పాత్రలలో నటిస్తూ హీరోగా అవకాశాలను అందుకొని నేడు మాస్ మహారాజగా పేరు సంపాదించుకున్నారు నటుడు రవితేజ. ఈయన సినిమా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు గొప్ప స్థాయిలో ఉన్నారు. అయితే కొత్తవారికి అవకాశాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈయన ఎంతోమంది కొత్త దర్శకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈ విధంగా రవితేజ పరిచయం చేసిన వారిలో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరు.

అసిస్టెంట్ డైరెక్టర్ గా హరిశంకర్ పని చేస్తున్న సమయంలోనే హరీష్ శంకర్ రవితేజ మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంది. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ డైరెక్టర్ గా రవితేజతో మొదటిసారిగా షాక్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ మరోసారి రవితేజ హరీష్ శంకర్ మిరపకాయ్ సినిమాలో అవకాశం కల్పించారు. ఇకపోతే తాజాగా రవితేజ నటించిన ధమాకా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అద్భుతమైన కలెక్షన్లను రాబడుతుంది.

ఇప్పటికే ఈ సినిమా 50 కోట్ల కలెక్షన్లలో రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఈ విధంగా ధమాకా సినిమా మంచి సక్సెస్ కావడంతో సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ హరీష్ శంకర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన తనకు రవితేజ అవకాశం కల్పించారని తనని అన్నయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాను. తాను అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్న సమయం నుంచి రవితేజ అన్నయ్యతో మంచి పరిచయమని హరీష్ శంకర్ తెలిపారు.

ఇలా తాను నన్ను నమ్మి నాకు దర్శకుడుగా అవకాశం ఇవ్వటం వల్లే నేను ఇండస్ట్రీలో దర్శకుడుగా నిలబడ్డానని నేను ఈ స్థానంలో ఉన్నానంటే అందుకు గల కారణం రవితేజ అన్నయ్యనే అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇలా తనకుఎంతో సహాయం చేసిన రవితేజ అన్నయ్యకు సభాముఖంగా తనకు పాదాభివందనం చేస్తున్నాను అంటూ తన కాళ్లకు నమస్కరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus