‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమా ద్వారా జ్యోతికృష్ణ (Jyothi Krishna ) మళ్లీ ఫుల్ ఫోకస్ లోకి వచ్చారు. మొదట ఈ ప్రాజెక్ట్‌ను క్రిష్ హ్యాండిల్ చేస్తుండగా, కొన్ని కారణాల వల్ల జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ నటిస్తున్న ఈ భారీ పీరియాడికల్ డ్రామా చివరి దశ పనుల్లో ఉంది. పవన్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఈ సినిమాకు వేచి చూస్తున్నారు. 2025 లో సినిమా విడుదల చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారు.
ఈ సినిమా విజయమే జ్యోతికృష్ణ కెరీర్‌ను మళ్ళీ మలుపు తిప్పే అవకాశంగా భావిస్తున్నారు. ఇప్పటికే దర్శకత్వ రంగంలో ఐదు సినిమాలు చేసిన జ్యోతికృష్ణ, ఇప్పటివరకు పూర్తి స్థాయిలో పెద్ద హిట్‌ను అందుకోలేకపోయారు. ‘నీ మనసు నాకు తెలుసు’ సినిమాతో ప్రేమ కథలపై తన సెన్సిబిలిటీని చూపించిన జ్యోతికృష్ణ, ఆ చిత్రం కమర్షియల్‌గా పెద్దగా ఆడకపోయినా, ఎమోషనల్ టచ్‌కు మంచి మార్కులు తెచ్చుకున్నారు. తర్వాత ‘కేడీ’ (Kedi), ‘ఊ లాలాలా’, ‘ఆక్సిజన్’ (Oxygen), ‘రూల్స్ రంజన్’ (Rules Ranjann) వంటి సినిమాలతో ప్రయత్నం చేసినా, అన్ని మిశ్రమ ఫలితాలే అందుకున్నాడు. అయినా తన మార్క్ నమ్మకంతో ముందుకు సాగుతున్నాడు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, హరిహర వీరమల్లు సినిమా తర్వాత జ్యోతికృష్ణ మళ్లీ ఒక క్లాసిక్ లవ్ స్టోరీ డిజైన్ చేస్తున్నాడట. ఈసారి ఫుల్ ఫీల్ గుడ్ ఎమోషన్స్‌తో కూడిన కథను సిద్ధం చేస్తున్నారని టాక్. మ్యూజిక్, విజువల్స్, ఎమోషన్స్ అన్నిటినీ పక్కా ప్లాన్‌తో తీసుకురావాలని చూస్తున్నాడట. గతంలో ప్రేమ కథలతో తన సున్నితమైన టచ్ చూపిన అనుభవం ఇప్పుడు కొత్తగా ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. జ్యోతికృష్ణ ఈ కొత్త లవ్ స్టోరీ కోసం నటీనటుల ఎంపిక, మ్యూజిక్ డైరెక్టర్ లాంటి ముఖ్యమైన అంశాలపై ఇప్పటికే పనులు మొదలు పెట్టినట్టు సమాచారం.
ఓ నేషనల్ లెవెల్ మ్యూజిక్ డైరెక్టర్‌తో మ్యూజిక్ కంపోజ్ చేయించాలని భావిస్తున్నాడట. సినిమాకు నచ్చే ఫ్రెష్ పేయిర్‌ను వెతికే పనిలో ఉన్నారు. మొత్తానికి హరిహర వీరమల్లు తర్వాత జ్యోతికృష్ణ ప్రేమ కథలో మరోసారి తన టాలెంట్ చూపించబోతున్నాడు. ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం, ఈసారి జ్యోతికృష్ణ తన సెన్సిబిలిటీని కమర్షియల్ గా కూడా కనెక్ట్ అయ్యేలా మలచాలని చూస్తున్నాడట. ఫీల్ గుడ్ రొమాంటిక్ డ్రామాలకు ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉండటంతో, జ్యోతికృష్ణ కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త లవ్ స్టోరీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందట.