Kalyan Krishna: ‘బంగార్రాజు’ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ కి హీరోల కష్టాలు!

  • May 27, 2022 / 07:10 PM IST

‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ కృష్ణ. ఆ తరువాత ‘రా రండోయ్ వేడుక చూద్దాం’, ‘నేల టికెట్’ వంటి సినిమాలను రూపొందించారు. ఈ ఏడాది ‘బంగార్రాజు’ సినిమాతో మరో కమర్షియల్ హిట్ అందుకున్నారు. సినిమాకి ఏవరేజ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్ పరంగా పెద్ద హిట్ అయింది. హిట్టు కొట్టినప్పటికీ.. ఇప్పటివరకు మరో సినిమా అనౌన్స్ చేయలేదు ఈ డైరెక్టర్.

నిజానికి ఇండస్ట్రీ సక్సెస్ రేట్ మీదే నడుస్తుంది. హీరోలు కూడా హిట్టు డైరెక్టర్లతోనే పని చేయాలనుకుంటారు. అలాంటిది కళ్యాణ్ కృష్ణ కెరీర్ లో మూడు కమర్షియల్ హిట్స్ ఉన్నప్పటికీ హీరోలు మాత్రం దొరకడం లేదు. నిజానికి కోలీవుడ్ నిర్మాత జ్ఞానవేల్.. కళ్యాణ్ కృష్ణతో సినిమా చేయాలనుకున్నారు. ఈ మేరకు ఆయనకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని భావించారు. కానీ ప్రస్తుతం స్టార్ హీరోలు, యంగ్ హీరోలంతా బిజీగా ఉండడంతో జ్ఞానవేల్ ప్రొడక్షన్ పని చేయడానికి హీరోలు దొరకడం లేదు.

ఒక్కొక్కరూ రెండు, మూడు ప్రాజెక్ట్ లు ఓకే చేసుకొని ఉండడంతో ఇప్పట్లో మన టాలీవుడ్ హీరోలు కాల్షీట్స్ ఇచ్చేలా లేరు. దీంతో కళ్యాణ్ కృష్ణ వైజాగ్ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. అక్కడే ఉంటూ తన తదుపరి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను రెడీ చేసుకుంటున్నారు. హీరో ఫైనల్ అయితే వెంటనే సినిమాను అనౌన్స్ చేస్తారు. కానీ కళ్యాణ్ కృష్ణకు ఇంకొన్నాళ్లు వెయిట్ చేయక తప్పేలా లేదు!

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus