Koratala Siva: జూనియర్ ఎన్టీఆర్ సింప్లిసిటీ గురించి సీక్రెట్ చెప్పిన కొరటాల.!

విజయ్ (Vijay Thalapathy) హీరోగా దిల్ రాజు (Dil Raju) రూపొందించిన తమిళ చిత్రం “వారిసు” (తెలుగులో “వారసుడు” (Varisu) ప్రీరిలీజ్ ఈవెంట్లో విజయ్ సింప్లిసిటీ గురించి దిల్ రాజు మాట్లాడుతూ “సార్ విత్ టీ కప్.. అదిదా సార్” అంటూ చేసిన ప్రసంగం ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విజయ్ లాంటి హయ్యస్ట్ పెయిడ్ యాక్టర్ ప్రొడ్యూసర్ కోసం టీ కప్పు పట్టుకురావడం అనేది అతడి సింప్లిసిటీకి నిదర్శనంగా నిలిచింది. ఇప్పుడు అదే తరహాలో ఎన్టీఆర్ (Jr NTR)   గురించి కొరటాల (Koratala Siva) ఓ విషయం చెప్పి షాక్ ఇచ్చాడు.

Koratala Siva

ఎన్టీఆర్ పెద్ద హీరో కదా, ఇంటికి వెళ్తే ఎక్కడో ఒక ఆఫీస్ లాంటి రూమ్ లో కూర్చుని ఉంటాడులే అనుకుంటే.. వంటగదిలో కనిపిస్తాడు అని చెప్పడం తారక్ సింప్లిసిటీ లెవల్ ను అందరికీ ఒకసారి పరిచయం చేసినట్లయింది. “దేవర” (Devara) ప్రమోషన్స్ లో భాగంగా డిజే టిల్లు (DJ Tillu) ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) మరియు విశ్వక్ సేన్ (Vishwak Sen) లతో కలిసి ఎన్టీఆర్ & కొరటాల శివ ఒక కామన్ ఇంటర్వ్యూ చేశారు.

సరదాగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ సినిమా విశేషాలను డిస్కస్ చేసిన వీడియో ప్రోమోను ఇవాళ విడుదల చేశారు. ఆ ప్రోమోలో తారక్ చాలా హ్యాపీగా కనిపించాడు. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను సెప్టెంబర్ 22న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.

జాన్వికపూర్ (Janhvi Kapoor)  తెలుగు డెబ్యూ అయిన ఈ సినిమా విజయం సాధించడం అందరికంటే దర్శకుడు కొరటాలకు (Koratala Siva) చాలా కీలకం. అందుకే కొరటాల చాలా కష్టపడి “దేవర”ను తన కెరీర్ లోనే బెస్ట్ సినిమాగా మలిచాడని వినికిడి. సైఫ్ అలీఖాన్ ను (Saif Ali Khan) ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా అవుట్ పుట్ ఏ స్థాయిలో ఉందో తెలియాలంటే సెప్టెంబర్ 27 వరకు వెయిట్ చేయాల్సిందే.

 ‘భలే ఉన్నాడే’ 6 రోజుల్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus