ఒక పది సినిమాలు తీసి రిటైర్ అయిపోతాను! : క్రాంతి మాధవ్

  • July 8, 2020 / 12:03 PM IST

మానవీయబంధాలను సినిమాటిక్ లిబర్టీస్ తో తెరకెక్కించే దర్శకులు చాలా తక్కువమంది ఉంటారు. మరీ క్లాసిక్ డైరెక్టర్స్ తో పోల్చలేం కానీ.. ప్రేమతత్వాన్ని చెప్పడంలో ప్రెజంట్ జనరేషన్ డైరెక్టర్స్ లో ఎవరూ కూడా ఈయన్ని బీట్ చేయలేరు. అంత గొప్పగా చెప్పాడని కాదు.. అంత స్వచ్ఛంగా తాను తెరకెక్కించిన “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” చిత్రంలో చెప్పాడు దర్శకుడు క్రాంతి మాధవ్. ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం “ఉంగరాలా రాంబాబు”. సునీల్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 15న విడుదలకానుంది. ఈ సందర్భంగా సినిమా విశేషాల గురించి, తన తదుపరి చిత్రాల గురించి, తన కెరీర్ గురించి దర్శకుడు క్రాంతి మాధవ్ చెప్పిన సంగతులు మీకోసం..!!

ఇదో సెల్ఫిష్ స్టోరీ..
“ఉంగరాల రాంబాబు” కొత్త కథేమీ కాదు. ఒక వ్యక్తి “నేను” అనే స్థాయి నుండి “మనం” అనుకొనే స్థితికి చేరుకోడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా బేసిక్ థీమ్. సునీల్ ఈ సినిమాలో మూడ నమ్మకాలున్న వ్యక్తిగా టైటిల్ పాత్ర పోషించాడు. మన రెగ్యులర్ లైఫ్ లో రోజూ మనం చూసే కొందరి జీవితాలను ఆధారంగా ఈ కథ రాసుకొన్నాను.

నాది ముసలి ధోరణి..
ప్రెజంట్ జనరేషన్ కి తగ్గ సినిమాలు నేను తీయలేను, నా ఆలోచనాధోరణి, నా తత్వం నేటి తరానికి సింక్ అవ్వవు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే నాది కాస్త ముసలి ధోరణి. అందుకే నాకు నచ్చిన విషయాలపైనే సినిమాలు తీయగలను.

కామెడీ నా ఫేవరెట్ జోనర్..
నేను ఒక ఊరి జ్ణాపకాల నేపధ్యంలో “ఓనమాలు” తీశాను, తర్వాత స్వచ్చమైన ప్రేమ నేపధ్యంలో “మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు” తీశాను. ఒక దర్శకుడిగా అన్నీజోనర్స్ లో సినిమాలు చేయాలన్నది నా కోరిక. అందులోనూ కామెడీ అనేది నా ఫేవరెట్ జోనర్. అందుకే “మళ్ళీ అంల్లీ ఇదిరాని రోజు” తర్వాత “ఉంగరాల రాంబాబు” లాంటి కామెడీ స్క్రిప్ట్ ను ఎంచుకొన్నాను.

థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడు బాధలన్నీ మర్చిపోవాలి..
నేను “మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు” సినిమా తీస్తున్నప్పుడు మా అమ్మగారు చనిపోయారు. అది జరిగి మూడేళ్లవుతోంది. నేను ఇప్పటికీ ఆ విషయంలో బాధపడుతూనే ఉంటాను. అలా ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బాధ, ఇబ్బంది ఉంటాయి. ఆ బాధను పర్చిపోడానికే ప్రేక్షకుడు సినిమా చూడ్డానికి వస్తాడు. దానికి కామెడీ బెస్ట్ టానిక్. అందుకే ఈ సినిమాని ప్యూర్ హ్యూమర్ తో తెరకెక్కించాను.

“ఓనమాలు” బాధపెట్టగా.. “మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు” సంతోషపెట్టింది..
నాకు తెలిసి బాక్సాఫీస్ దగ్గర హిట్ అయిన సినిమానే “కమర్షియల్ సినిమా”. నేను తీసిన “ఓనమాలు” ఒక దర్శకుడిగా సంతృప్తినిచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది. అయితే.. ఒక దర్శకుడిగానే కాక బాక్సాఫీస్ లెక్కల ప్రకారం కూడా నాకు పూర్తి సంతృప్తినిచ్చిన చిత్రం “మళ్ళీ మళ్ళీ ఇదిరాని రోజు”.

నేను క్రిటిసిజంను ఇష్టపడతాను..
నేను ఒక రూమ్ లో కూర్చొని రాసిన కథను థియేటర్ లో కొందరు చూసి మూడు గంటలపాటు తమ సమయాన్ని వెచ్చించి చూడడమే కాక నా సినిమా ఎలా ఉందనే విషయాన్ని జడ్జ్ చేస్తూ రివ్యూలు ఇవ్వడమో ఆర్టికల్స్ రాయడమో చేస్తున్నారు. అలాంటప్పుడు నేను వారి మాటలను నెగిటివ్ గా తీసుకోలేను. వాళ్ళు రాసిన నా తప్పులను నేను ఇష్టపడతాను, చదువుతాను, సరిదిద్దుకోడానికి ట్రై చేస్తాను. బేసిక్ గా నేను క్రిటిసిజాన్ని ఇష్టపడతాను.

చార్లీ చాప్లిన్ ప్రభావం నాపై బాగా ఉంటుంది..
మూకీ సినిమాల కాలంలోనే చార్లీ చాప్లిన్ సమాజంపై ప్రభావం చూపగల ఎన్నో సినిమాలు తెరకెక్కించారు. హెయిర్ స్టయిల్ మొదలుకొని డ్రెస్సింగ్ వరకూ ఎలాంటి మార్పు లేకుండా, కనీసం ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా సమాజానికి ఉపయోగపడే ఎన్నో విషయాలను చెప్పారు. ఆయన సినిమాల ప్రభావం నాపై చాలా ఉంటుంది.

400ల సినిమాలు తీసిన వ్యక్తిని నేనెలా జడ్జ్ చేయను..
సునీల్ ఇప్పటికే ఒక నాలుగొందల సినిమాల్లో నటించేశారు. అంటే నాలుగొందల పాత్రల్లో ఆల్రెడీ జీవించేశారు. అలాంటిది ఆయన్ని ఇంకెంత కొత్తగా చూపించగలను చెప్పండి. అయితే.. నాకు కుదిరినంతలో కొత్తగా చూపించడానికి ట్రై చేశా.

తదుపరి సినిమా విజయ్ దేవరకొండతో..
సెప్టెంబర్ 20 తర్వాత నా నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అవుతుంది. విజయ్ దేవరకొండ హీరోగా కె.ఎస్.రామారావు నిర్మాణ సారధ్యంలో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీ తీస్తాను.

ఒక పది సినిమాలు చేసి రిటైర్ అయిపోతా..
ఒక డైరెక్టర్ గా ఎన్ని సినిమాలు తీశామ్ అనేదానికంటే ఎన్ని గుర్తుంచుకోదగ్గ సినిమాలు తీశాను అనే విషయానికి నేను ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను. డిఫరెంట్ జోనర్స్ లో ఒక పది సినిమాలు తీసి రిటైర్ అయిపోతాను.

– Dheeraj Babu


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus