దర్శకుడు క్రిష్ ఈ మధ్య నవలలపై బాగా దృష్టి పెట్టారు. అవార్డు నవల ‘కొండపొలం’ కాన్సెప్ట్ తో సినిమా తీసేశారు. సినిమాకి కూడా అదే టైటిల్ పెట్టారు. ఇందులో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించారు. ఈ సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినప్పటికీ.. కమర్షియల్ గా మాత్రం వర్కవుట్ అవ్వలేదు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు మరో నవలని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు దర్శకుడు క్రిష్. అయితే ఈసారి దర్శకుడిగా కాదు.. నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ ని చేపట్టబోతున్నారు.
మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన ‘9 గంటలు’ నవలని ఆయన ఇప్పుడు వెబ్ సిరీస్ గా రూపొందిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్ స్టార్ లో ఈ సిరీస్ టెలికాస్ట్ కానుంది. క్రిష్ దగ్గర సహాయకుడిగా పని చేసిన ఓ కుర్రాడికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సగం వర్క్ కూడా పూర్తయిందట. నిజానికి ఈ నవలని సినిమాగా తీయాలనేది క్రిష్ ఆలోచన. కానీ ‘కొండపొలం’ రిజల్ట్ అనుకున్నట్లుగా రాకపోవడంతో ఇప్పుడు ‘9 గంటలు’ కాన్సెప్ట్ ని వెబ్ సిరీస్ గా తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
క్రిష్ మరికొన్ని నవలలపై కూడా దృష్టి పెట్టారని.. త్వరలోనే అవి సినిమాలుగానో.. వెబ్ సిరీస్ గానో రాబోతున్నాయని తెలుస్తోంది. మరోపక్క క్రిష్ దర్శకుడిగా ‘హరిహర వీరమల్లు’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్ర పోషిస్తోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా కనిపించనుంది. నర్గీస్ ఫక్రి, అర్జున్ రామ్ పాల్ లాంటి బాలీవుడ్ నటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. మొన్నామధ్య ఈ సినిమాకి సంబంధించిన టీజర్ విడుదల కాగా..
అది యూట్యూబ్ లో సెన్సేషన్ అయింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కొంతవరకు జరుపుకుంది. కొత్త షెడ్యూల్ ని మరికొన్ని రోజుల్లో మొదలుపెట్టనున్నారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?