సినిమా తెరకెక్కించడం అంటే చిన్నపని కాదు. 24 క్రాఫ్ట్స్ సక్రమంగా పని చేస్తే ముందుకెళ్తుంది. సాధారణ ప్రదేశం, సమయంలోనే సినిమా చిత్రీకరణ కష్టం. అలాంటిది కరోనా సమయంలో, అందులోనూ అడవిలో షూటింగ్ అంటే అంత సులభమా. అచ్చంగా ఇలాంటి పరిస్థితుల్లో ‘కొండపొలం’ టీమ్ షూటింగ్ చేసింది. ఆ సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఇటీవల క్రిష్ మాట్లాడారు. ఈ సందర్భంగా షూటింగ్ జరిగిన విధానం గురించి చెప్పుకొచ్చారు. ‘హరి హర వీరమల్లు’కి పనిచేసిన బృందమే ‘కొండపొలం’కీ పని చేసిందట. కరోనా – లాక్‌డౌన్తో చిత్ర పరిశ్రమ స్తంభించిపోయింది.
పనులు లేక చాలామంది ఖాళీగా ఉన్న సమయం అది. అప్పుడే ‘కొండపొలం’చేయాలనే ఆలోచన వచ్చిందట క్రిష్‌కి. ఈ విరామంలో సినిమా చేస్తే చాలామందికి పని కల్పించినట్టు అవుతుందని అనుకున్నారట. అలా ‘కొండపొలం’ సినిమా పట్టాలెక్కిందట. ఓసారి పవన్ కల్యాణ్‌తో మాట్లాడుతున్నప్పుడు ‘ఉప్పెన’ గురించి, అందులో వైష్ణవ్ కళ్లకు వచ్చిన పేరు గురించి ప్రస్తావన వచ్చిందట. అది గుర్తుండి… హీరోగా వైష్ణవ్ అయితే బాగుంటుంది క్రిష్ అనుకున్నారట. మొదట సినిమాను గోవాలో షూట్ చేద్దాం అనుకున్నారట.
దాని కోసం అనుమతులు కూడా తీసుకున్నారట. అయితే గొర్రెలు, గొర్రెలకాపరులతో చిత్రీకరణ చేస్తామన్నాక.. గొర్రెల్ని చూసి పులులు వచ్చేస్తాయని అనుమతి నిరాకరించారు. నల్లమలలో షూటింగ్ చేద్దామని అనుకున్నా… కుదరలేదు. దాంతో వికారాబాద్ అడవుల్లో చిత్రీకరించాం. ఏకధాటిగా 40 రోజులు అక్కడే చిత్రీకరించాం. అందరం సెట్ బాయ్స్ తరహాలో వస్తువుల్ని మోసుకుంటూ వెళ్లి షూటింగ్ చేసి వచ్చాం అని క్రిష్ చెప్పుకొచ్చారు.
Most Recommended Video
హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!