Krishna Vamsi: ‘ఖడ్గం’ సినిమా ఇప్పుడు తీస్తే అంతే.. దర్శకుడి వ్యాఖ్యలు!

టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దేశభక్తి కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాలో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. సోనాలి బింద్రే, సంగీత, కిమ్ శర్మ హీరోయిన్స్ గా నటించారు. అప్పట్లో ఈ సినిమా ఓ రేంజ్ లో ఆడింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో టెలికాస్ట్ అవుతూనే ఉంటుంది. ఇందులో పాటలు కూడా బావుంటాయి.

అయితే ఈ సినిమాలో హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉండేవారిని తీవ్రవాదులుగా చూపించడం, టెర్రరిస్ట్ లకు ఆశ్రయం ఇచ్చేవారిలా చూపించడంపై అప్పట్లో దుమారం రేగింది. ముస్లిం మతస్థులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. థియేటర్లపై దాటాడు కూడా చేశారు. ఈ సినిమా రిలీజ్ తరువాత దర్శకుడు కృష్ణవంశీ ప్రాణ భయంతో కొన్నాళ్లు అండర్ గ్రౌండ్ కి వెళ్లిపోయారని టాక్. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు కృష్ణవంశీ ఇచ్చిన సమాధానం వైరల్ అవుతోంది.

‘మీ నుంచి ‘ఖడ్గం’ లాంటి సినిమా కోసం వెయిటింగ్’ అని ఓ నెటిజన్ అడగ్గా.. ‘ఇప్పుడైతే చంపేస్తారేమో సార్’ అంటూ ఫన్నీగా బదులిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న కాంట్రవర్సీలను దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఆయన సినిమాల విషయానికొస్తే.. చాలా కాలం గ్యాప్ తరువాత ఆయన నుంచి ‘రంగమార్తాండ’ అనే సినిమా వస్తోంది. ఇందులో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్, బ్రహ్మానందం, రాహుల్ సిప్లిగంజ్, అనసూయ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఈ సినిమాకి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా తరువాత కృష్ణవంశీ ‘అన్నం’ అనే మరో సినిమా చేయబోతున్నారు. దీంతో పాటు ఓ వెబ్ సిరీస్ ను కూడా డైరెక్ట్ చేయబోతున్నారు.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus