KV Anudeep: ‘జాతిరత్నం’ కి మోక్షం ఎప్పుడు..!?

‘పిట్టగోడ’ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనుదీప్ కేవీ (Anudeep Kv) .. ఆ సినిమాతో పెద్ద గుర్తింపు సంపాదించుకోలేదు కానీ.. ఆ తర్వాత వచ్చిన ‘జాతి రత్నాలు’ తో (Jathi Ratnalu) పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆ ఒక్క సినిమాతో ఇతను టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు. ఆ తర్వాత ఏకంగా శివ కార్తికేయన్ తో (Sivakarthikeyan) సినిమా చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. ‘ప్రిన్స్’ టైటిల్ తో రూపొందిన ఆ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి డిజాస్టర్ గా మిగిలింది.

‘ప్రిన్స్’ 2022 దీపావళి కానుకగా రిలీజ్ అయ్యింది. దాని తర్వాత అనుదీప్ నుండి మరో సినిమా రాలేదు. అంటే ఏడాదిన్నర పాటు ఖాళీగా ఉన్నాడు. ఇంకా అతని నెక్స్ట్ సినిమా స్టార్ట్ అవ్వలేదు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ లో రవితేజతో (Ravi Teja) ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ ఎందుకో ఆ ప్రాజెక్టు సెట్ అవ్వలేదు. అదే బ్యానర్లో అనుదీప్ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపించాయి. కానీ అలాంటిదేమీ జరగడం లేదు.

వేరే బ్యానర్లో ట్రై చేసుకోవాలనే స్టెప్ కూడా అనుదీప్ తీసుకుంటున్నట్టు కనిపించడం లేదు. మరి నిర్మాత పట్టు వల్లో ఏమో కానీ అక్కడే ఉండిపోయాడు. మొన్నటికి మొన్న చిరంజీవికి ఓ లైన్ చెప్పాడు. చిరు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. అనిల్ సుంకర ఈ ప్రాజెక్టు నిర్మించడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు సమాచారం. కానీ ‘విశ్వంభర’ (Vishwambhara) ఫినిష్ అయ్యే వరకు చిరు (Chiranjeevi) ఇంకో సినిమా చేయకపోవచ్చు. మరి అనుదీప్ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus