Lokesh Kanagaraj: పదేళ్ల వరకు లోకేష్ బిజీ బిజీ!

రీసెంట్ గా ‘విక్రమ్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. అంతకముందు తీసిన ‘ఖైదీ’ సినిమాతో కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు తెలుగు వారిని కూడా మెప్పించారు. ‘విక్రమ్’తో అతడి రేంజ్ మరింత పెరిగింది. ఈ క్రమంలో అతడు తెలుగులో సినిమాలు చేయబోతున్నాడని కొన్ని వార్తలు వినిపించాయి. రామ్ చరణ్ తో సినిమా పక్కా ఉంటుందని అన్నారు. కానీ అదంతా జరిగేలా లేదు. లోకేష్ కనగరాజ్ మరో పదేళ్ల వరకు బిజీ.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం విజయ్ తో చేయబోయే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ పనులతో బిజీగా ఉన్న లోకేష్ ఈసారి కూడా భారీ క్యాస్టింగ్ సెట్ చేసుకోబోతున్నారు. లోకి యూనివర్స్ పేరుతో డెవలప్ చేస్తున్న కాన్సెప్ట్ కి సంబంధం లేకుండా పూర్తిగా కొత్త కథను రాసుకుంటున్నారట. ఇది పూర్తయ్యాక ‘ఖైదీ2’ మొదలవుతుంది. ఈ సినిమాకి కార్తీ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జైలుకి వెళ్లడానికి ముందు ఢిల్లీ జీవితంలో ఏం జరిగిందనేది చూపించబోతున్నారు.

ఆ తరువాత ‘విక్రమ్2’ మొదలుపెడతారు. ఆ తరువాత సూర్యతో సెపరేట్ గా ‘రోలెక్స్’ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఒక్కో సినిమాకి ఎలా లేదన్నా.. రెండేళ్ల సమయం పడుతుంది. అది దృష్టిలో పెట్టుకునే లోకేష్ మరో పదేళ్ల వరకు బిజీ అని చెప్పారు. మొదటి నుంచి కూడా లోకేష్ కోలీవుడ్ ఇండస్ట్రీనే తనకు ప్రాధాన్యమని చెబుతూ వచ్చారు.

అలానే తన సినిమాల ప్లానింగ్ కూడా ఉంది. బాలీవుడ్ నుంచి కూడా ఆఫర్స్ వస్తున్నా.. లోకేష్ మాత్రం కోలీవుడ్ లోనే సినిమాలు తీస్తున్నారు. లోకేష్ తీయబోయే సినిమాలన్నింటికీ కూడా అనిరుద్ సంగీతం అందించనున్నారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus