ఈ ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న దర్శకులలో కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ఒకటి. ఈ సినిమా ఇలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. చాలా కాలం తరువాత కమల్ హాసన్ విక్రమ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ సినిమా ఏకంగా 400 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
ఇక ఈ సినిమాలో కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాలో చివరి ఐదు నిమిషాలలో క్యామియో రోల్ లో సూర్య నటన అద్భుతమని చెప్పాలి. సూర్య రోలెక్స్ పాత్ర ద్వారా తన నటనతో థియేటర్ మొత్తాన్ని ఓ ఊపు ఊపారు.ఇకపోతే తాజాగా డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని రోలెక్స్ పాత్ర గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుతం లోకేష్ విజయ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ఖైదీ 2, విక్రమ్ సీక్వెల్ చిత్రాలను చేస్తానని చెప్పుకొచ్చారు. ఇక పరిస్థితులను బట్టి తన యూనివర్సిటీ సినిమాలు కాస్త అటు ఇటుగా రావచ్చు అని తెలిపారు.ఇలా తాను లైన్లో పెట్టిన సినిమాలతో మరో 10 సంవత్సరాలు సెటిల్ అయ్యారని ఈయన నవ్వుతూ చెప్పారు.
ఇకపోతే విక్రమ్ సినిమాలో చివరి ఐదు నిమిషాలలో సూర్య నటించిన రోలెక్స్ పాత్ర గురించి మాట్లాడుతూ..తాను రోలెక్స్ పాత్రతోనే మరో సినిమా చేస్తానంటూ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమాలో సూర్య రోలేక్స్ గా ఎలా మారాడు? అతను ఎలా అయ్యాడు అనే విషయాల గురించి ఒక సినిమా చేస్తానని ఈయన చెప్పడంతో ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి.
గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!