చప్పుడు లేకుండా రిలీజ్ అయిన ‘సైతాన్’ ట్రైలర్ చాలా హాట్ టాపిక్ అయ్యింది. అందుకు కారణం ఈ ట్రైలర్ లో ఉన్న బూతులు, మితిమీరిన శృంగా* సన్నివేశాలు , విపరీతమైన హింస. అయితే ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు మహి వి రాఘవ్ తెరకెక్కించాడు అని తెలిసి.. ఇంకా షాక్ అయ్యారు జనాలు. ఎందుకంటే మహి వి రాఘవ్ గతంలో ‘పాఠశాల’ ‘ఆనందో బ్రహ్మ’ ‘యాత్ర’ వంటి మంచి మంచి సినిమాలు తీశాడు. ముఖ్యంగా దివంగత ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ను చాలా చక్కగా తీసి..
ఆ టైములో వైసిపి పార్టీకి అది మంచి మైలేజ్ ఇచ్చింది. అందుకే మహి రాఘవ్ ఇమేజ్ బాగా పెరిగింది. ఈ మధ్యనే ‘సేవ్ ది టైగర్స్’ అనే వెబ్ సిరీస్ ను కూడా ఆయన రూపొందించాడు. దానికి ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి దర్శకుడు ‘సైతాన్’ అనే ఘోరమైన వెబ్ సిరీస్ తీశాడేంటి అంటూ అంతా షాక్ అయ్యారు. ఈ విషయం పై దర్శకుడు మహి వి రాఘవ్ క్లారిటీ ఇచ్చాడు.
మహి వి రాఘవ్ (Mahi V Raghav) మాట్లాడుతూ… “నేను ఈసారి క్రైమ్ డ్రామా జోనర్ ఎంపిక చేసుకోవడం జరిగింది. ఇందులో నలుగురు వ్యక్తులు వారు సజీవంగా ఉండటానికి ఇతరులను చంపుకుంటూ పోతారు. ఇంతకుముందు నేను ఇలాంటి జానర్ టచ్ చేయలేదు. ఇందులో ఉన్న కంటెంట్ ప్రేక్షకులకు అర్థమవ్వాలంటే అందుకు తగ్గట్లుగా ఆ సన్నివేశాలు, బూతులు ఉండాలి. కథ డిమాండ్ చేసింది కాబట్టే వాటిని పెట్టాల్సి వచ్చింది. అంతే తప్ప ప్రేక్షకులను అట్రాక్ట్ చేయడానికి వాడిన టెక్నిక్ కాదిది.
ఒక రైటర్ గా,డైరెక్టర్ గా జనాలకు ఒక కథ చెప్పాలనుకున్నాను.సైతాన్ క్యాప్షన్ ఏంటో తెలుసా? ‘మీరందరూ నేరం అనేదాన్ని వారు మనుగడ అని చెప్తున్నారు’. సమాజంలో వివక్షకు గురైన ఎంతోమంది బాధితులే నేరస్థులుగా తయారవుతారు. మిధుంటర్ మూవీలో చిన్న వయసులోనే వేధింపులకు, చీత్కారాలకు గురైన పిల్లలు తర్వాత నేరస్థులిగా మారారు. కానీ వారు అలా అవడానికి కారణం సమాజమే! ఈ పాయింట్ తీసుకునే ‘సైతాన్’ సిరీస్ రూపొందించాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ సిరీస్ జూన్ 15 నుండి డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది.
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!
టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు