Yatra 2: యాత్ర2 మూవీలో జగన్ రోల్ లో ఆ నటుడు కనిపిస్తారా?

మహి వి రాఘవ డైరెక్షన్ లో తెరకెక్కిన యాత్ర సినిమా ఏ స్థాయిలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వైఎస్సార్ అభిమానులకు నచ్చింది. పేద ప్రజలకు వైఎస్సార్ ఏ విధంగా దగ్గరయ్యారో ఈ సినిమాలో ప్రధానంగా ప్రస్తావించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాల వెనుక ఆలోచనల గురించి కూడా ఈ సినిమాలో ప్రస్తావించారు. మమ్ముట్టి రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించి ఆ పాత్రకు జీవం పోశారనే సంగతి తెలిసిందే.

మమ్ముట్టి కాకుండా ఆ పాత్రలో ఎవరు నటించినా ఆ స్థాయిలో రెస్పాన్స్ అయితే వచ్చేది కాదు. ఈ సినిమాకు సీక్వెల్ ను తెరకెక్కిస్తానని మహి వి రాఘవ గతంలోనే ప్రకటించడం జరిగింది. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ డైరెక్టర్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా షాకింగ్ విషయాలను వెల్లడించారు. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ గురించి సోషల్ మీడియాలో సైతం పాజిటివ్ రివ్యూలు తెగ వైరల్ అవుతున్నాయి.

యాత్ర2 (Yatra 2) గురించి మహి వి రాఘవ్ మాట్లాడుతూ యాత్ర2 సినిమాను తెరకెక్కిస్తానని అయితే ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళుతుందో చెప్పలేనని ఆయన వెల్లడించారు. స్కామ్ 1992 ఫేమ్ ప్రతీక్ గాంధీ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం అందుతోంది. అయితే ప్రతీక్ గాంధీ ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

2024 ఎన్నికల ముందు ఈ సినిమా విడుదలైతే బాగుంటుందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మహి వి రాఘవ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే మహి వి రాఘవ కూడా స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరతారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus