Maruthi, Prabhas: ప్రభాస్ తో మారుతి ఎలాంటి సినిమా చేయబోతున్నారు..?

  • June 28, 2022 / 04:18 PM IST

టాలీవుడ్ కమర్షియల్ డైరెక్టర్ మారుతి ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ అనే సినిమాను రూపొందించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు మారుతి. ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ.. పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ తో మారుతి చేయబోయే సినిమా గురించి ప్రస్తావన వస్తుంది. దీంతో మారుతి.. ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నారు..? హారర్ జోనర్ అంటున్నారు నిజమేనా..? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పారు.

ప్రభాస్ తో తను ఎలాంటి సినిమా చేయబోతున్నానో కొందరు మాట్లాడేసుకుంటున్నారని.. సినిమా కూడా వాళ్లే తీస్తారేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. ప్రభాస్ ని ఎలా చూపించాలో తనకొక క్లారిటీ ఉందని.. అలానే చూపించే ప్రయత్నం చేస్తానని అన్నారు. తను ఎలాంటి సినిమా చేయగలనో అందరికీ తెలుసునని, తన కామెడీ, తన జోనర్ నచ్చే అప్రోచ్ అవుతారని.. తన మార్క్ లోనే సినిమా చేస్తానని అన్నారు. ఈ విషయంపై ఓ ఉదాహరణ కూడా చెప్పారు.

‘మనం నాటుకోడి బాగా వండుతామని తెలిసి మనల్ని పిలిచినప్పుడు మనకి వచ్చిన వంటే చేసి పెట్టాలి తప్ప మనకి రాని చైనీస్ వంట వండకూడదు’ అంటూ చెప్పుకొచ్చారు. మారుతి మాటలను బట్టి చూస్తుంటే ప్రభాస్ సినిమా ఆయన మార్క్ లోనే ఉండబోతుందని తెలుస్తోంది. కాకపోతే ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్లుగా కొన్ని ఎలిమెంట్స్ ను యాడ్ చేయొచ్చని అర్ధమవుతుంది.

ప్రస్తుతానికి ప్రభాస్-మారుతి సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ను ఇంకా లాక్ చేయలేదు. కొందరు రైటర్స్ తో మారుతి కథా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఫైనల్ నేరేషన్ ఇచ్చి ప్రాజెక్ట్ లాక్ చేయాలనుకుంటున్నారు మారుతి. ఈ ప్రాజెక్ట్ ‘పక్కా కమర్షియల్’ రిజల్ట్ పై ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా రిజల్ట్ ఏ మాత్రం తేడా కొట్టినా ప్రభాస్ తో ప్రాజెక్ట్ ఇంకా డిలే అవ్వడం ఖాయం!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus