‘మహానటి’ సినిమా తర్వాత విశేషమైన పాపులారిటీ గడించిన దర్శకుడు నాగ్ అశ్విన్. అంతటి ఘన విజయాన్ని సాధించిన తర్వాత కూడా ఎప్పటిలానే తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా ఉన్నాడే తప్ప ఎక్కడా బీరాలు పలకలేదు. అలాంటి నాగ్ అశ్విన్ ఒక్కసారిగా తెలంగాణ ప్రభుత్వంపై మరియు ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రుల యంత్రాంగంపై మండిపడ్డాడు. రాష్ట్ర రాజధానిలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆదివారం వైద్యులు అందుబాటులో లేని కారణంగా నా మిత్రుడు మరియు దేశంలోనే బెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ లో ఒకడైన వ్యక్తి ఇప్పుడు ప్రాణాలతో లేడు. మన దేశంలో ఎందుకని ప్రభుత్వ ఆసుపత్రల మీద నమ్మకం పెట్టుకోలేం అని బాధపడ్డాడు నాగ్ అశ్విన్.
ఈ విషయమై కేటీఆర్ వెంటనే స్పందించినప్పటికీ.. పెద్దగా ఉపయోగం లేకపోయింది. ఇప్పుడేదో నాగ్ అశ్విన్ అడిగాడు కాబట్టి ఇష్యుని అందరూ పట్టించుకొంటున్నారు కానీ.. గత కొన్నేళ్లుగా ప్రభుత్వాసుపత్రులు పనితనం అలాగే ఉంది. ఇలాంటి సెలబ్రిటీల ట్వీట్స్ తోనైనా ఆ యంత్రాంగంలో ఏదైనా మార్పు వస్తుందేమో చూడాలి.