సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) నటించిన “జైలర్” (Jailer) సినిమాకు ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రం కోలీవుడ్‌లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది. అనిరుద్ రవిచందర్ అందించిన సంగీతం, నెల్సన్ దిలీప్ (Nelson Dilip Kumar) మేకింగ్, రజినీకాంత్ మేనరిజమ్ సినిమా సక్సెస్ కు బలాన్ని ఇచ్చాయి. సినిమా ముగింపులో “జైలర్ 2″పై పరోక్షంగా క్లూ ఇచ్చి, నెల్సన్ దిలీప్ మరింత హైప్ క్రియేట్ చేశారు.
మొదట్లో “జైలర్ 2″ను (Jailer 2) 2025 దీపావళికి విడుదల చేయాలని టీం భావించినట్లు సమాచారం. అయితే తాజా సమాచారం ప్రకారం, నెల్సన్ తన ప్రాజెక్ట్ పై ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈసారి మరింత హై వోల్టేజ్ స్క్రిప్ట్‌తో, హై ఇన్‌టెన్సిటీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారట. ఈ నిర్ణయంతో సినిమా ప్రీప్రొడక్షన్ ప్రక్రియలో మార్పులు చేస్తున్నట్లు టాక్. ఆ మేరకు సినిమాను 2026 సమ్మర్‌లో విడుదల చేయాలని కొత్తగా డేట్ ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇదిలా ఉండగా, సీక్వెల్‌లో రజినీకాంత్ సరసన ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రకు ప్రముఖ స్టార్ పై ఫోకస్ పెట్టినట్లు టాక్. మొదటి పార్ట్ లో విన్నయకన్ పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా, సీక్వెల్ కోసం మరింత పవర్ఫుల్ ప్రతినాయకుడిని ఎంపిక చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం సౌత్ నుండి ఒక పెద్ద స్టార్ విలన్‌ను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
రజినీకాంత్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో “కూలీ” (Coolie) సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ సినిమా తర్వాతే “జైలర్ 2” సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కూలీ చిత్రంలో రజినీకాంత్ మరోసారి హై వోల్టేజ్ యాక్షన్ లో కనిపించనున్నారు. “వేట్టయ్యన్” (Vettaiyan) అంచనాలు అందుకోలేకపోవడంతో, సూపర్ స్టార్ నుంచి వచ్చే ప్రతి ప్రాజెక్ట్‌పై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకుంటున్నారు. మరి తలైవా ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి.