రామాయణాన్ని ఎన్నిసార్లు సినిమాగా తీసినా జనాలు చూస్తారు. ఎందుకంటే అంది రాయమాయణం కాబట్టి. అయితే రామాయణాన్ని తెరకెక్కించిన ప్రతిసారి కొత్తగా చూపించడంలో మన దర్శకులు సిద్ధహస్తులు. అలా ఇప్పుడు మరోసారి రామాయణం తెరకెక్కుతోంది. ‘ఆదిపురుష్’ పేరుతో ఓం రౌత్ రామాయణాన్ని రూపొందిస్తున్నారు. ప్రభాస్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్నఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ క్రమంలో సినిమా ఆలోచన ఎలా వచ్చిందో ఓం రౌత్ చెప్పుకొచ్చారు. సినిమా ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకునే ముందు ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర పేరు రాముడు కాదు అనేది గమనార్హం.
అవును ఈ సినిమా ప్రభాస్‌ను రాఘవ అని పిలుస్తారట. అదెందుకు అనేది తెలియదు కానీ, రాఘవ అని అంటే రాముడు అనే అర్థం కాబట్టి ఆ పేరు పెట్టాం అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. ఎందుకు పెట్టారు అనేది మాత్రం దర్శకుడు ఓం రౌత్ వెల్లడించలేదు. అంతేకాదు ఈ సినిమా భారాన్ని ప్రభాస్ కాబట్టే అంత సులభంగా మోయగలిగారు అని కూడా అంటున్నారు దర్శకుడు. యుగో సాకో అనే జపనీస్ డైరెక్టర్ రామాయణం స్ఫూర్తితో ఓ సినిమా తీశారు.
ఆ సినిమాను ఓం రౌత్ చూస్తున్నప్పుడు… ఒక విదేశీయుడే మన పురాణ గాథను ఇంత ఆసక్తికరంగా తీసినపుడు, మనం ఎందుకు చేయకూడదు అని అనిపించిందట. దీంతో రామాయణానికి కొత్త వెర్షన్ రాయడం మొదలు పెట్టారట ఓం రౌత్. ఈ కథ రాస్తున్నపుడు రాముడిగా ప్రభాస్‌ను తప్ప వేరొకరిని ఊహించుకోలేదన్నారు ఓం రౌత్. స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నాక ఫోన్‌లో ప్రభాస్‌కు కథ చెప్పే ప్రయత్నం చేశారట. మూడు సన్నివేశాలు విని… నేను నేరుగా వచ్చి కథ వింటాను అన్నాడట ప్రభాస్.
కథ విన్న వెంటనే ప్రభాస్ సినిమాకు ఓకే చెప్పాడట. ₹400 కోట్ల భారీ బడ్జెట్‌తో సినిమా రూపొందిస్తున్నారట. ఈ ఏడాది సెకండాఫ్‌లో సినిమాను రిలీజ్ చేస్తారట. హిందీ, తెలుగులో ఈ సినిమా తెరకెక్కింది. తమిళ, మలయాళ, కన్నడతో పాటు మరికొన్ని భాషల్లో సినిమాను డబ్ చేస్తారట. దేశంలోనే అత్యంత భారీగా ఈ సినిమాను విడుదల చేస్తామని ఓం రౌత్ తెలిపారు.