‘రాధేశ్యామ్’ ఫలితంలో ప్రభాస్ అభిమానులు ఎంత నిరాశచెందారో తెలియదు కానీ, ఆ సినిమా ప్రచారంలో ప్రభాస్ లుక్స్ చూసి మాత్రం తెగ బాధపడ్డారు. కారణం డార్లింగ్ పూర్తిగా షేప్‌ఔట్‌లో కనిపించడమే. బాలీవుడ్ మీడియా అయితే ఏకంగా ప్రభాస్ వయసు ఎంత? అంటూ జోక్ లేసింది కూడా. అయితే ఇలాంటి విమర్శలకు కచ్చితంగా ‘ఆదిపురుష్’ సమాధానమిస్తుంది అంటున్నారు దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమాలో ప్రభాస్ లుక్స్ గురించి ఓం చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి.
‘ఆదిపురుష్’ సినిమా మైథలాజికల్ ఫిల్మ్ అనే విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ రాముడిలా కనిపిస్తాడు. దీని కోసం ప్రభాస్ చాలా వర్క్ చేశాడు. బాడీ నుండి లుక్ వరకు చాలా మార్పులు చేసుకున్నాడు. సినిమా కోసం ప్రభాస్ విలువిద్యలో శిక్షణ కూడా తీసుకున్నారు. మామూలుగా విలుకారుల దేహదార్ఢ్యం ‘V’ ఆకారంలో ఉంటుంది. అంటే భుజాలు విశాలంగా, నడుము భాగం సన్నగా ఉండటుంది. దీనినే ‘వి’ షేప్ అని అంటారు. అలాంటి ఆకృతిలోకి ప్రభాస్ మారాడు అని ఓం రౌత్ చెప్పాడు.
కాబట్టి ప్రభాస్ లుక్స్ గురించి ఏం బాధపడక్కర్లేదు. నేనున్నా అంటూ ఓం రౌత్ భరోసా ఇచ్చారు. అంతే కాదు తెలుగు వెర్షన్ కోసం సంస్కృతం డైలాగ్స్, హిందీ వెర్షన్ కోసం హిందీ డైలాగ్స్‌ని స్పష్టంగా పలకడానికి ప్రభాస్ సాధన చేశాడని కూడా ఓం చెప్పారు. అందుకే ‘ఆదిపురుష్’గా ప్రభాస్ యాప్ట్ అని చెబుతున్నాను అని కూడా అన్నాడు. సినిమాలో ప్రభాస్ కళ్లు చాలా షార్ప్‌గా కనిపిస్తాయని, పాత్ర ఇంటెన్సిటీని ఆ చూపులో స్పష్టంగా కనిపించేలా డిజైన్ చేశామని చెప్పారు ఓం రౌత్.
‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘బాహుబలి’తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్ ఆ తర్వాత ‘సాహో’, ‘రాధేశ్యామ్’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ రేంజి ఇంపాక్ట్ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ‘ఆదిపురుష్’తో తర్వాత ‘సలార్’తో డార్లింగ్ ఈజ్ బ్యాక్ అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఫ్యాన్స్ కూడా అదే ఆశిస్తున్నారు. డార్లింగ్ మరి వింటున్నావా
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?