Om Raut: బలవంతం చేసి ‘ఆదిపురుష్’ కి ప్రభాస్ ని ఒప్పించాం : ఓం రౌత్

ప్రభాస్ లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’ రిలీజ్ అయ్యి 4 రోజులు కావస్తోంది. ఈ సినిమాకి మొదటి రోజు మిక్స్డ్ టాక్ వచ్చింది. రామాయణాన్ని దర్శకుడు వక్రీకరించాడు అంటూ కొంతమంది నెటిజన్లు చిత్ర బృందం పై మండిపడ్డారు. ఇంకొంతమంది అయితే కేసులు కూడా వేస్తున్నారు. అయినప్పటికీ ‘ఆదిపురుష్’ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ముఖ్యంగా నార్త్ లో ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేస్తుంది. అయితే ‘ఆదిపురుష్’ పై జరుగుతున్న ట్రోలింగ్ కు ప్రభాస్ అభిమానులు హర్ట్ అవుతున్నారు.

అసలు ఈ సినిమాకు ప్రభాస్ ఒప్పుకోకుండా ఉండాల్సింది అంటూ కామెంట్లు పెడుతున్నారు. వాస్తవానికి ప్రభాస్ .. ‘ఆదిపురుష్’ కథ చేయడానికి మొదట ఇంట్రెస్ట్ చూపలేదట. ఈ విషయాన్ని దర్శకుడు ఓం రౌత్ చెప్పుకొచ్చాడు. అతని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయని చెప్పాలి. దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ.. ” ‘ఆదిపురుష్’ ఇప్పటి జనరేషన్ కోసం తీసిన సినిమా. రామాయణం మొత్తాన్ని 3 గంటల్లో తెరపై చూపించడం వీలు కాదు.

అందుకే యుద్ధకాండను మాత్రమే ఎంచుకున్నాను. పర్సనల్ గా నాకు ఈ పార్ట్ చాలా ఇష్టం. ఇందులో రాముడు పరాక్రమవంతుడిగా కనిపిస్తాడు. ప్రభాస్ ఈ పాత్రకు కచ్చితంగా సరిపోతాడు అని నాకు ముందు నుంచి అనిపించింది.హృదయంలోని భావాలు కళ్లలో కనిపిస్తాయనేది నా నమ్మకం. ప్రభాస్ కళ్లలో నీతి, నిజాయతీ కనిపిస్తుంటాయి. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ చాలా వినయంగా బిహేవ్ చేస్తాడు. అందుకే ‘ఆదిపురుష్’ చేయాలని అనుకున్న రోజే రాముడిగా ప్రభాస్ మాత్రమే సరిపోతాడనిపించింది.

మొదట ప్రభాస్ ఇందుకు ఒప్పుకోలేదు. అతడిని ఒప్పించడానికి చాలా (Om Raut) కష్టపడ్డాము. ఫోన్లో అతని పాత్రని వివరించడం కష్టమైంది. దీంతో డైరెక్ట్ గా అతన్ని కలిసి స్టోరీ చెప్పాను. అప్పుడు ప్రభాస్ ఓకే అన్నాడు. తర్వాత చాలా శ్రద్ధగా చేశాడు. నాకు అన్ని విధాలుగా సహకరించాడు. భవిష్యత్తులోనూ మా స్నేహం ఇలాగే కొనసాగుతుందని భావిస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus