పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ఆది పురుష్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా జూన్ 16వ తేదీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఐదు భాషలలో విడుదలైంది. ఇక ఈ సినిమా పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ కలెక్షన్లు మాత్రం భారీగానే రాబడుతుందని తెలుస్తుంది. ఇక రామాయణం ఇతిహాసం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించారు. ఈ క్రమంలోనే ప్రభాస్ రాముడి లుక్ గురించి చాలామంది విమర్శలు చేశారు.
అసలు ఆయన రాముడిలాగా ఏమాత్రం కనిపించడం లేదు అంటూ విమర్శించారు కానీ ఈ సినిమాలో రాముడి పాత్రలో నటించడం కోసం డైరెక్టర్ ప్రభాస్ ను ఎంపిక చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయాలను ఒక సందర్భంలో బయటపెట్టారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ రామాయణం సినిమాని మొత్తం తెరపై చూపించడం ఏమాత్రం సాధ్యం కాదని తెలిపారు. అందుకే తాను రామాయణంలో ఒక భాగమైనటువంటి యుద్ధకాండను తీసుకొని ఈ తరం వారికి అనుగుణంగా ఈ సినిమాని చిత్రీకరించామని తెలిపారు.
ఈ భాగంలో రాముడు చాలా పరాక్రమంతుడిగా ఉంటారు అలాగే ఆయన కళ్ళల్లో నీతి నిజాయితీ కనపడుతుంది. మనసులోని భావాలను కూడా కళ్ళల్లో చూపించాలి. ఇలా నటించడానికి ప్రభాస్ చాలా కరెక్ట్ గా సరిపోతారని భావించి తనని ఈ సినిమా కోసం ఎంపిక చేసుకున్నామని తెలిపారు. అయితే ఈ సినిమాలో నటించడానికి ప్రభాస్ అంత సులువుగా ఒప్పుకోలేదని ఆయనను ఒప్పించడానికి చాలా కష్టపడ్డామని తెలిపారు.ఇక ఈ సినిమాలోని రాముడి పాత్రకు ప్రభాస్ ఖచ్చితంగా సరిపోతారు.
ఆయన ఎంతో స్టార్ హీరో అయినప్పటికీ ఇతరుల పట్ల చాలా వినయంగా ఎంతో నిబద్ధతగా ఉంటారు అందుకే ఈ సినిమా కథ అనుకోగానే తనకు ప్రభాస్ ఈ కథకు కరెక్ట్ గా సరిపోతారని భావించి తనని ఎంపిక చేసుకున్నామని తెలిపారు.మొదట్లో ఈ విషయం చెప్పగానే ప్రభాస్ చాలా ఆశ్చర్యపోయాడు అయితే ఆయనకి ప్రతి ఒక్కటి వివరించి చెప్పగా చివరికి ఒప్పుకున్నారని డైరెక్టర్ ఓం రౌత్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్