Ram Pothineni: రామ్‌ కొత్త సినిమా… మైత్రీ ప్లాన్‌ ఏంటి? ఎప్పుడు స్టార్ట్‌?

‘డబుల్ ఇస్మార్ట్‌’ (Double Ismart) సినిమా షూటింగ్‌కి విరామం దొరకడంతో రామ్‌ పోతినేని (Ram Pothineni) కొత్త కథలు వినే పనిలో పడ్డాడు. వివిధ కారణాల వల్ల సినిమా షూటింగ్‌ కాస్త ఆగడంతో తర్వాతి లైనప్‌ను తేలుస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు, ముగ్గురు అగ్ర దర్శకుల పేర్లు వినిపించినా.. ఇప్పుడు ఓ కుర్ర దర్శకుడి పేరు చర్చలోకి వచ్చింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే లాంగ్‌ గ్యాప్‌ తర్వాత ఇటీవల రెండో సినిమా చేసిన దర్శకుడు రామ్‌తో సినిమా చేయబోతున్నారట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అని చెబుతున్నారు కూడా.

‘డబుల్‌ ఇస్మార్ట్‌’ షూటింగ్‌ను త్వరగా ముగించుకుని త్వరలో కొత్త సినిమా పనుల్లోకి వెళ్లాలని రామ్‌ చూస్తున్నాడు. అయితే ఆ సినిమా ఏది అనేది ఇంతవరకు తేలడం లేదు. అయితే ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr. Polishetty) సినిమాతో ఇటీవల ప్రేక్షకుల్ని మెప్పించిన పి.మహేశ్‌బాబు (Mahesh Babu P)… రామ్‌ కోసం ఓ ఎమోషనల్‌ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. రామ్‌కు ఇప్పటికే స్క్రిప్ట్‌ను వినిపించాగా.. ఆయన లైక్‌ చేశారట. పూర్తి స్థాయి కథను సిద్ధం చేసి పట్టాలెక్కిస్తారట.

మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తెరకెక్కిస్తుందని ఓ టాక్‌ నడుస్తోంది. సెప్టెంబరు నుండి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి అనుకున్నట్లుగా ఈ సినిమా ఓకే అవుతుందా? లేక గత పుకార్లలా ఇది ఇక్కడితో ఆగిపోతుందా అనేది చూడాలి. ఎందుకంటే త్రివిక్రమ్‌తో కలసి రామ్‌తో సినిమా చేయాలని స్రవంతి రవికిషోర్‌ (Sravanthi Ravi Kishore) ప్లాన్‌ చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు మహేష్‌బాబు.పి పేరు చర్చకు వచ్చింది.

అయితే, ‘డబుల్ ఇస్మార్ట్‌’ విషయంలో చాలా డౌట్స్‌ ఉన్నాయి. సినిమా షూటింగ్‌ ఆపేశారని, బడ్జెట్‌ సమస్యలు అని చెప్పారు. అయితే అవన్నీ తేలాయని త్వరలో షూటింగ్‌ రీస్టార్ట్‌ అని అన్నారు. అయితే వరుసగా మ్యూజింగ్స్‌ చేసిన పూరి ఇప్పుడు ఆపేశారు. అంటే షూటింగ్‌ పనులు మొదలైనట్లే అని అంటున్నారు. ఎందుకంటే ఆయన సినిమా పనుల్లో లేకపోతేనే మ్యూజింగ్స్‌ చేస్తుంటారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus