టాలీవుడ్ లో టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ కన్నా…టైమింగ్ ఉన్న డైరెక్టర్స్ ఎక్కువగా దొరుకుతారు. అయితే టాలెంట్ ఉన్న డైరెక్టర్స్ కాలానికి పదును పెడితే ఎలా ఉంటుందో మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా సంభాషణల విషయంలో రచయిత, దర్శకుడు ఇద్దరూ తమ అవగాహన మేరకు ప్రేక్షకులను కట్టి పడేయగలిగితే ఇండస్ట్రీలో సక్సెస్ అందుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. అయితే అలనాడు జంధ్యాల గారు రచించిన పదునైన సంభాషణలు అయితేనేమి, ఆతరువాత ఆయన రచించిన హాస్య ఛలోక్తులు అయితేనేమి, ప్రేక్షక లోకాన్ని కట్టిపడేయ్యడమే కాకుండా, జంధ్యాల గారిని అందరి మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేశాయి. ఇక ఆతరువాత మన ఇండస్ట్రీకి దొరికిన ఆణిముత్యాల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఒకరు.
ఆయన సినిమాలు ఇంతటి ప్రేక్షక ఆధరణ పొందుతున్నాయి అంటే దానికి కారణం ఆయన రచించే డైలాగ్స్ అనే చెప్పాలి. ఇక అదే కోవలోకి వస్తాడట మన యువ దర్శకుడు పరశురామ్….మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన శిరీష్ ఎట్టి పరిస్థితుల్లో హిట్ కొట్టాలి అన్న కసితో ఉన్న సమయంలో ‘శ్రీరస్తు-శుభమస్తు’ కధ చెప్పాడు పరశురామ్. ఇక ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించింది. అదే క్రమంలో ‘శ్రీరస్తు శుభమస్తు’ సక్సెస్ మీట్లో భాగంగా దర్శకుడు సుకుమార్ పరశురామ్ ను త్రివిక్రమ్ తో పోల్చాడు.
త్రివిక్రమ్ తర్వాత తెలుగులో అంత గొప్ప రచయిత పరశురామే అని కితాబిచ్చారు. దానికి కారణం లేకపోలేదు…‘శ్రీరస్తు శుభమస్తు’లో మనసుకు హత్తుకునే మాటలు రాశాడు పరశురామ్. ఎమోషనల్ సన్నివేశాల్లో డైలాగులు అద్భుతంగా కుదిరాయి. ఈ నేపథ్యంలో అందరూ అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. అదే క్రమంలో మన సుక్కు కూడా పరశురామ్ ని తన స్టైల్ లో పొగిడేసాడు. సుక్కు లాంటి గ్రేట్ డైరెక్టర్ నుంచి ఈ కాంప్లిమెంట్ అందుకోవడం అంటే పరశురామ్ కి అంతకన్నా ఏం కావాలి.