మొత్తానికి ‘గీత గోవిందం’ డైరెక్టర్ తేల్చి చెప్పేసాడు…!

‘గీత గోవిందం’ చిత్రంతో తన రేంజ్ ను మరింత పెంచుకున్నాడు దర్శకుడు పరసురామ్(బుజ్జి). 2018 ఆగష్టు 15 న విడుదలైన ఆ చిత్రం 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబట్టింది. అయితే ఆ చిత్రం తర్వాత పరశురామ్ బిజీ అవుతాడు అనుకుంటే అలా జరగలేదు. పెద్ద హీరోల దగ్గర నుండీ చిన్న హీరోల వరకూ ఎవ్వరూ ఖాళీ లేకపోవడంతో పరశురామ్ వెయిటింగ్ లిస్టులో ఉంటాడు అని అంతా అనుకున్నారు. అయితే నాగ చైతన్య … పరశురామ్ తో సినిమా చెయ్యడానికి ముందుకొచ్చాడు.

‘నాగేశ్వర రావు’ అనే పేరుతో ఈ ప్రాజెక్ట్ మొదలుకావాల్సి ఉంది.కానీ మహేష్ బాబుతో సినిమా చేసే అవకాశం రావడంతో పరశురామ్… చైతన్య ప్రాజెక్ట్ ను పక్కన పెట్టేసాడు. ఈ విషయం పై చైతన్య కూల్ గానే ఉన్నా … తండ్రి నాగార్జున మాత్రం దర్శకుడు పరశురామ్ పై చాలా కోపంగా ఉన్నాడని.. ఇలా ప్రాజెక్ట్ ఒప్పుకుని పక్కన పెట్టడం ఏమిటి అని పరశురామ్ కు ఫోన్ చేసి తిట్టాడు అని కూడా టాక్ నడిచింది.

అయితే ఆ వార్తల్లో నిజం లేదని పరశురామ్ చెప్పుకొచ్చాడు. ‘మహేష్ బాబు తో సినిమా పూర్తయ్యాక నాగ చైతన్య తో సినిమా ఉంటుంది. నాగ చైతన్య కెరీర్లో కూడా అది చెప్పుకోదగిన చిత్రం అవుతుంది. ‘నాగార్జున గారు నాపై చాలా కోపంగా ఉన్నారు’ అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. నాకు, అక్కినేని కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉంది. దయచేసి ఆ వార్తలను నమ్మకండి’ అంటూ చెప్పుకొచ్చాడు పరశురామ్.

Most Recommended Video

‘బాహుబలి’ ని ముందుగా ప్రభాస్ కోసం అనుకోలేదట…!
పోకిరి స్టోరీకి మహేష్ చెప్పిన చేంజెస్ అవే..!
హీరోయిన్స్ గా ఎదిగిన హీరోయిన్స్ కూతుళ్లు వీరే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus