ప్రశాంత్ నీల్ రెండు సార్లు స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) కి దెబ్బేసాడు అని అంతా చెబుతుంటారు. గతంలో షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘జీరో’ (Zero) సినిమా రిలీజ్ అయ్యింది. ఆ పక్కనే ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో తెరకెక్కిన ‘కేజీఎఫ్’ సినిమా కూడా రిలీజ్ అయ్యింది. ఒకే రోజు రిలీజ్ అయిన ఈ రెండు సినిమాల్లో.. ‘జీరో’ పై ‘కేజీఎఫ్’ (KGF) పై చేయి సాధించింది. హిందీలో సైతం కేజీఎఫ్ భారీ వసూళ్లు సాధించి ‘జీరో’ ని బీట్ చేసింది.
అలా ప్రశాంత్ నీల్ వల్ల షారుఖ్ ఖాన్ కి పెద్ద దెబ్బ పడింది. ఆ గాయం మానడానికి చాలా టైమ్ పట్టింది. గత ఏడాది రిలీజ్ అయిన ‘పఠాన్’ చిత్రం షారుఖ్ ఖాన్ కి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. అది వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత ‘జవాన్’ (Jawan) వచ్చింది. అది కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరింది. ఆ తర్వాత ‘డంకీ’ (Dunki) కూడా డిసెంబర్లో వచ్చింది. ఏడాదికి ముందే ‘డంకీ’ రిలీజ్ డేట్ ని ప్రకటించారు రాజ్ కుమార్ హిరానీ (Rajkumar Hirani) అండ్ టీం.
అయితే సెప్టెంబర్లో రావాల్సిన ‘సలార్’ ని (Salaar) వాయిదా వేసి డిసెంబర్లో తెచ్చాడు ప్రశాంత్ నీల్. ఆ సినిమా వల్ల ‘డంకీ’ కి పెద్ద దెబ్బ తగిలింది. ‘సలార్’ యాక్షన్ సినిమా కావడం, పైగా ప్రభాస్ హీరో కావడంతో ‘డంకీ’ని నార్త్ ప్రేక్షకులు కూడా పట్టించుకోలేదు. కాంబినేషన్ క్రేజ్ వల్ల క్యాష్ చేసుకునే అవకాశం ఉన్నా ‘సలార్’ వల్ల కుదర్లేదు. దీంతో సౌత్ , నార్త్ ఆడియన్స్ మధ్యలో చిచ్చుపెట్టినట్టు అయ్యింది.
అందువల్ల షారుఖ్ ఖాన్ కి ప్రశాంత్ నీల్ క్షమాపణలు తెలిపారు. ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ..” ‘డంకీ’ విడుదల టైమ్లో ‘సలార్’ను తీసుకొచ్చి తప్పు చేశాము. ఇందుకుగాను హీరో షారుఖ్ ఖాన్‌కి, దర్శకుడు రాజ్ కుమార్ హిరానీకి క్షమాపణలు తెలుపుకుంటున్నాము” అంటూ చెప్పుకొచ్చారు.