టాలీవుడ్ ఇండస్ట్రీలో డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి ప్రశాంత్ వర్మ పేరు ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోతుంది. ఈయన ఇటీవల దర్శకత్వం వహించినటువంటి హనుమాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ విడుదలైనటువంటి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమా చూసినటువంటి ప్రేక్షకులు సినిమాపై పెద్ద ఎత్తున ప్రశంసల వర్షం కురిపించడమే కాకుండా డైరెక్టర్ పని తీరుపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రశాంత్ వర్మ వరస ఇంటర్వ్యూలలో పాల్గొని సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన కెరియర్ మొదట్లో ఎదుర్కొన్నటువంటి చేదు సంఘటనలను అవమానాలను గురించి చెబుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా ప్రశాంత్ వర్మ మాట్లాడుతూ కెరియర్ మొదట్లో తాను ఎంతో మంది దర్శకుల చేత అవమానాలు పడ్డానని తెలిపారు.
ఇంజనీరింగ్ చదివే రోజుల్లో షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు చేశాను. వాటికి దక్కిన సర్టిఫికెట్స్ పట్టుకుని అసిస్టెంట్ డైరెక్టర్ గా అవకాశం ఇస్తారని తిరిగేవాడిని. వాటిని చూసి చాలా మంది ఓవర్ కాన్ఫిడెన్స్ అంటూ కామెంట్లు చేయడంతో వాటిని తీసుకెళ్లడం మానేశాను. ఒకరు రికమెండ్ చేస్తే ఓ డైరెక్టర్ అవకాశం ఇచ్చాడు. ఆ డైరెక్టర్ రేయ్ వెళ్లి మంచి నీళ్లు తీసుకురా అన్నాడు. నన్ను కాదనుకుని నేను అటూ ఇటూ చూశాను.
రేయ్ నిన్నేరా అంటూ నన్ను ఒక ఆఫీస్ బాయ్ కంటే ఘోరంగా అవమానించారని ఆయన తెలిపారు అయితే మరోసారి ఆయన నా సలహా కోసం నా దగ్గరకు వచ్చారని ప్రశాంత్ వర్మ వెల్లడించారు. ఇలా తన కెరీర్లు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులను ఈ సందర్భంగా ఈయన (Prashanth Varma) మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!