Chiranjeevi: ఆ పుట్టుమచ్చ వల్ల చిరంజీవికి కలిసొచ్చిందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో మెగాస్టార్ చిరంజీవి ఒకరనే సంగతి తెలిసిందే. తన సినీ కెరీర్ లో చిరంజీవి ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించి ఆ పాత్రల ద్వారా ఘనవిజయాలను సొంతం చేసుకున్నారు. అయితే చిరంజీవి కెరీర్ తొలినాళ్లలో చిన్నచిన్న పాత్రల్లో నటించారనే విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా దాదాపుగా 39 సంవత్సరాల క్రితం బిల్లా రంగా అనే సినిమా తెరకెక్కింది. ప్రముఖ దర్శకులలో ఒకరైన కె.ఎస్.ఆర్.దాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

బిల్లా రంగా మూవీ షూటింగ్ సమయంలో చిరంజీవి చొక్కా మార్చుకుంటుండగా కె.ఎస్.ఆర్ దాస్ కు చిరంజీవి వీపుపై పెద్ద పుట్టుమచ్చ కనిపించింది. ఆ మచ్చను చూసిన కె.ఎస్.ఆర్ దాస్ సీనియర్ ఎన్టీఆర్ లా నీకు కూడా పెద్ద మచ్చ ఉందని సీనియర్ ఎన్టీఆర్ లా నువ్వు కూడా పాపులారిటీని సంపాదించుకుంటావంటూ చిరంజీవికి చెప్పుకొచ్చారు. తరువాత కాలంలో ఆయన జోస్యం నిజమై చిరంజీవి నిజంగానే మెగాస్టార్ గా స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.

దాదాపుగా 35 సంవత్సరాలుగా చిరంజీవి టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. స్టార్ డైరెక్టర్లు, యంగ్ డైరెక్టర్లు అనే తేడా లేకుండా ప్రతిభ ఉన్న దర్శకులను చిరంజీవి ప్రోత్సహిస్తున్నారు. మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్, బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా, మెహర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ సినిమాల్లో చిరంజీవి నటిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఒక్కో సినిమాకు 30 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం నటిస్తున్న సినిమాలు హిట్టైతే చిరంజీవి రెమ్యునరేషన్ ను పెంచే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus