Director Puri Jagannadh: సూపర్‌ హిట్‌ సాంగ్‌పై స్పందించిన పూరి

ఆడవాళ్లు, ఏడుపులు… ఈ రెండింటినీ కలిపి మాట్లాడుతుంటారు కొందరు. కొన్ని సినిమాల్లో సైతం ఇలానే చూపిస్తూ వచ్చారు. మొన్నీమధ్య బిగ్‌బాస్‌లో కూడా ఆడాళ్లూ – కన్నీళ్లూ అంటూ జోకులు కూడా విసిరారు. కానీ ఆ భావన తప్పని అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌.ప్రపంచంలో ఆడవాళ్లు లేకపోతే ఏడుపులు ఉండవనే భావన తప్పు. ఆడవాళ్లు ఎప్పుడూ ఏడవకూడదు అంటూ తన తాజా మ్యూజింగ్స్‌లో చెప్పుకొచ్చారు పూరి. ఆడవాళ్లు ఏడవద్దు అనే భావనతో బాబ్‌ మార్లే పాడిన పాటకు అసలు అర్థాన్ని వివరించారు.

ఈ పాటను తనతోపాటు చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారని, అసలు అర్థం ఇదని పూరి చెప్పారు. ఓ రోజు పటాయాలో బీచ్‌ ఒడ్డున రెస్టారెంట్‌లో కూర్చున్నప్పుడు, ఒక వ్యక్తి బాబ్‌ మార్లే పాటలు పాడుతున్నాడట. అలా అతను ‘నో విమెన్ నో క్రై’ అనే పాటను మొదలుపెట్టాడు. ఆ పాట వింటూనే రెస్టారెంట్‌లోని మగవాళ్లంతా అరుపులు, విజిల్స్‌ వేశారు. దీంతో అక్కడున్న ఆడాళ్లంతా చిన్నబుచ్చుకున్నారట. సింగర్‌ ‘నో విమెన్ నో క్రై’ అన్నప్పుడల్లా మగాళ్లు అతడితో గొంతు కలిపి, అంతకంటే పెద్దగా ‘నో విమెన్‌ నో క్రై’ అని పాడారట.

కానీ పాట అసలు భావం ‘నో విమెన్‌ నో క్రై’ కాదు… ‘నో విమెన్‌ న క్రై’. దానర్థం ఆడవాళ్లు ఏడవద్దు అని అర్థం. కానీ చాలామంది ఈ పాటను తప్పుగా అర్థం చేసుకుంటుంటారు. నిజానికి ఈ పాట రాసింది విన్సెంట్ ఫోర్డ్‌. బాబ్‌ మార్లే ఈ పాట పాడాడు అంతే. విన్సెంట్‌ ఫోర్డ్‌ రాసిన ఆ పాటను అనువాదం చేస్తే ఇలా ఉంటుంది. ‘‘ట్రెంచ్‌ టౌన్‌లో ఒక బిడ్డను పోలీసులు కొడుతుంటే ఆ ఏడుపు నాకు వినిపిస్తుంది. ప్రభుత్వ స్థలంలో కూర్చున్నప్పుడు మంచి వ్యక్తులను, స్నేహితులను కలవడం, రాత్రులు దీపాలు వెలిగించడం, కార్న్‌ మీల్‌తో పూరిట్జ్‌ వండుకోవడం నాకు గుర్తుంది.

కానీ ప్రస్తుతం ప్రభుత్వ రాజకీయాల వల్ల అలాంటి ఆహ్లాదరకరమైన వాతావరణాన్ని కోల్పోతున్నాం. త్వరలోనే మనకు మంచి రోజులొస్తాయి’’ అనే అర్థంతో పాటు పూర్తి చేశాడు. దాని స్ఫూర్తితోనే బాబ్‌ మార్లే ‘ఆడవాళ్లు మీరు ఏడవద్దు’ అంటూ పాడాడు.అయితే ఈ పాటను చాలామంది తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒక్క జమైకా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్నారు. అలా ఈ పాటను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్లలో నేనూ ఉన్నాను అని చెప్పారు పూరి. నిజానికి ఇది ఆడవాళ్ల కన్నీళ్లు తుడిచే పాట అని చెప్పారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus