కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల అన్ని రంగాల వారికి ఆర్ధికంగా నష్టాలు వచ్చాయి. ఎక్కువగా సినీ పరిశ్రమను ఇది కోలుకోలేని దెబ్బ కొట్టిందనే చెప్పాలి. థియేటర్లు మూతపడ్డాయి, దీంతో విడుదల కావాల్సిన సినిమాలు కూడా ఆగిపోయాయి. షూటింగులు మొత్తం నిలిచిపోయాయి. చాలా మంది సినీ సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు.అందులో ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం వంటి వారు ప్రాణాలు కూడా కోల్పోయిన దారుణాలను కూడా మనం చూసాం. అన్‌లాక్ తర్వాత కరోనా కేసులు మరింత పెరగడం..
థియేటర్లు కూడా తెరుచుకోకపోవడం డిస్ట్రిబ్యూటర్లను తీవ్ర నిరాశకు నెట్టేసాయనే చెప్పాలి. 7 నెలలుగా థియేటర్లు మూతపడే ఉన్నాయి. థియేటర్లు తెరవడానికి డిస్ట్రిబ్యూటర్లు సన్నాహాలు చేస్తున్నప్పటికీ.. ప్రేక్షకులు వస్తారన్న గ్యారెంటీ లేదు. ఇప్ప్పటికే కొన్ని ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించ లేదు. ఈ క్రమంలో ఓటిటిల వైపే చూస్తున్నారు ప్రేక్షకులు,నిర్మాతలు. ఇదిలా ఉండగా.. తాజాగా కన్నడ సినీ పరిశ్రమ ‘కమ్.. లెట్స్ సెలబ్రేట్ సినిమా అగైన్’ పేరుతో ఓ వీడియోను రిలీజ్ చేసింది.’సినిమా థియేటర్లు అభిమానులకు దేవాలయాలు లాంటివి.. మళ్లీ థియేటర్లకు రండి, కలిసి సెలబ్రేట్ చేసుకుందాం’..
అనే అర్ధం వచ్చేలా ఆ వీడియో ఉంది. దీనిని చూసిన మన టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎమోషనల్ అయ్యాడు. ‘ఈ వీడియో చూస్తున్నప్పుడు కన్నీళ్లు వచ్చేసాయి. మళ్ళీ ఆ రోజులు రావాలి.. విజిల్స్ వెయ్యాలి.. పేపర్స్ ఎగరాలి.. చొక్కాలు చిరగాలి.. సినిమా థియేటర్.. మన అమ్మ’.. అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.
I got tears after watching this 👌🏾. మళ్ళీ ఆ రోజులు రావాలి . విజిల్స్ వెయ్యాలి , పేపర్స్ ఎగరాలి . చొక్కాలు చిరగాలి .. సినిమా థియేటర్ 🔥.. మన అమ్మ 🙏🏽 pic.twitter.com/TAnemU102d