Puri Jagannadh: చాలా కాలం తర్వాత భార్యా పిల్లలతో పూరి.. వైరల్ అవుతున్న ఫోటోలు!

పూరి జగన్నాథ్.. టాలీవుడ్లో ఈ పేరుకి ఓ రేంజ్ ఉంది. అలాగే పూరికి ఓ సెపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆయన తెరకెక్కించే సినిమాలు బాగున్నా… బాగోకపోయినా థియేటర్ కు వెళ్లి చూసే లాయల్ ఫ్యాన్స్ ఉన్నారు అనేది వాస్తవం. ‘ఇస్మార్ట్ శంకర్’ తో ఫామ్లోకి వచ్చాడు అనుకున్న పూరి… ‘లైగర్’ తో పెద్ద డిజాస్టర్ మూటగట్టుకుని మళ్ళీ పెవిలియన్ కు వెళ్ళాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘జన గణ మన’ సినిమా కూడా క్యాన్సిల్ అయ్యింది.

అలాగే పర్సనల్ లైఫ్ కూడా డిస్టర్బ్ అయ్యిందనే కామెంట్లు ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఎక్కువగా పూరి ముంబైలోనే ఉంటున్నాడని, హైదరాబాద్ కు ఎక్కువ రావడం లేదు అంటూ కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. అలాగే భార్యా పిల్లలకు దూరంగా ఉంటున్నాడు పూరి అనే కామెంట్లు కూడా కాస్త ఎక్కువగానే వినిపించాయి. ‘చోర్ బజార్’ ప్రీ రిలీజ్ వేడుకలో బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ తో ఈ వార్తలు ఇంకా ఎక్కువయ్యాయి.

అయితే ఆ వార్తలను కొట్టిపారేస్తూ తాజాగా (Puri Jagannadh) పూరి తన భార్యా పిల్లలతో కలిసి సందడి చేశాడు. తన సొంత ఊరు అయిన నర్సీపట్నంలో పూరి తన అన్నదమ్ములతో కలిసి కనిపించారు. అలాగే తన సతీమణి లావణ్య అలాగే పిల్లలతో కలిసి ఓ హోమాన్ని ఆచరించారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus