‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిపోయిందో తెలిసిందే. ఇంటర్నేషనల్ లెవెల్ లో అతడికి గుర్తింపు లభించింది. అయితే ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ కంటే ‘రాధేశ్యామ్’ సినిమా పెద్దదని అంటున్నాడు దర్శకుడు రాధాకృష్ణ. ప్రభాస్ ని దృష్టిలో పెట్టుకొని ఈ కథ రాయలేదని.. 18 ఏళ్ల క్రితం వచ్చిన ఐడియా ఇదని అన్నారు. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ లోకి రావడం మా అదృష్టమని.. ఆయన రాకతో ఈ సినిమా పరిధి పెరిగిందని అన్నారు.
కానీ ఇది ప్రభాస్ ఇమేజ్ కంటే పెద్ద సినిమా అని.. ఆ మాటకొస్తే ఏ హీరో ఇమేజ్ తో చూసుకున్నా.. ఇది పెద్ద కథే అవుతుందని అన్నారు. రాధేశ్యామ్ అందరికీ కనెక్ట్ అవుతుందని అంటున్నారు దర్శకుడు రాధాకృష్ణకుమార్. ఇది కేవలం క్లాస్ సినిమా మాత్రమే కాదని.. అందరికీ కనెక్ట్ అవుతుందని.. ఇది అందరి స్టోరీ అని చెప్పారు. మనకి, మన నమ్మకానికి మధ్య జరిగే ఫైట్ ఈ సినిమా అని..
పదేళ్ల కుర్రాడి నుంచి 70 ఏళ్ల వృద్ధుడి వరకు అందరికీ సినిమా కనెక్ట్ అవుతుందని.. ప్రేమ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పుకొచ్చారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. జనవరి 14న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
Most Recommended Video
83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!