Radha Krishna: ‘రాధే శ్యామ్‌’ గురించి ఆసక్తికర విషయం చెప్పిన డైరక్టర్‌!

‘రాధేశ్యామ్‌’ సినిమా షూటింగ్‌ ఎప్పుడో మొదలెట్టేశారు… ఇంకా రిలీజ్‌ చేయరు ఏంటి అని అందరూ అనుకున్నారు. ఇదిగో వచ్చేస్తోంది, అదిగో వచ్చేస్తోంది వార్తలు వచ్చినప్పుడ్లలా… హమ్మయ్య అనుకున్నారు. ఆఖరిలో ఏదో వాయిదా.. అలా సినిమా ఆలస్యమైపోయింది. తీరా విడుదల చేసేద్దాం అనుకున్నప్పుడు కరోనా వచ్చింది. దీంతో సినిమా ఆలస్యమైపోయింది. అలా సినిమా ఏకంగా నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. అయితే సినిమా కథను మూడింతలు ఎక్కువ సమయం పట్టిందనే విషయం తెలుసా? ఇటీవల దర్శకుడే ఈ విషయం చెప్పారు.

‘‘ఈ సినిమా తీయడానికి 4ఏళ్లు పడితే.. రాయడానికి 18ఏళ్లు పట్టింది’’ అంటూ దర్శకుడు కె.కె.రాధాకృష్ణ కుమార్‌ చెప్పుకొచ్చాడు. రామోజీ ఫిలింసిటీలో ఘనంగా జరిగిన ‘రాధేశ్యామ్’ ప్రిరిలీజ్‌ ఈవెంట్‌లో ఈ విషయం చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ కుమార్‌. ఈ పాయింట్‌ ను రాధాకృష్ణ తన గురువు చంద్రశేఖర్‌ యేలేటి సర్‌ దగ్గర విన్నారట. దేశంలో పెద్ద పెద్ద రచయితల్ని పిలిపించి రాయించినా.. కథకు సరైన ముగింపు దొరకలేదట. ఆసమయంలో చంద్రశేఖర్‌ యేలేటి ఓ మాటన్నారట. జాతకాల మీద చేస్తున్నాం కదా… ఈ కథ ఎవరికి రాసిపెట్టుందో అన్నారు. ఇది ప్రభాస్‌కే రాసిపెట్టుందని ఇప్పుడు అర్థమైంది.

ఈ సినిమాను ఛాలెంజ్‌లా తీసుకొని కథను సిద్ధం చేసుకున్నాను. ఫిలాసఫీని… ఓ లవ్‌స్టోరీలా రాసి ఆ కథను ప్రభాస్‌కు చెప్పారట దర్శకుడు. కథ నచ్చడంతో ముందుకు వెళ్లిపోయారట. ప్రభాస్‌ లాంటి ఫ్రెండ్‌, గురువు అందరికీ ఉండాలి అని మాత్రం చెప్పగలను అంటూ ఆనందంగా చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ కుమార్. అన్ని సినిమాల్లోలా ఈ సినిమాలో ఫైట్స్‌ ఉండవు. ఓ అమ్మాయికి అబ్బాయికి మధ్య జరిగే యుద్ధాలుంటాయి అంటూ వైవిధ్యంగా చెప్పుకొచ్చాడు రాధాకృష్ణ.

సినిమాలో ఓ అమ్మాయి కోసం అబ్బాయి సప్త సముద్రాలు దాటి వెళ్లే ప్రయాణముంటుంది. అంతే కానీ ఛేజింగ్‌లు లాంటివి చూపించం. ఇక సినిమా సంగతికొస్తే సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల చేస్తున్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వచ్చే వారానికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఆ సినిమాలో ఎమోషన్స్‌ ఉంటే… ఈ సినిమాలో ప్రేమ ఉంటుంది. ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తుందో చూడాలి.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus