Rahul Ravindran: రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమా షూటింగ్ డీటెయిల్స్!

రష్మిక మందన్న (Rashmika Mandanna) హీరోయిన్ గా రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో “గర్ల్ ఫ్రెండ్” అనే సినిమా మొదలైన విషయం తెలిసిందే. ఏడాది క్రితం మొదలైన ఈ చిత్రం షూటింగ్ నాలుగైదు షెడ్యూల్స్ లో జరిగింది. గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్ & ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించి కొన్ని రోజులుగా అస్సలు అప్డేట్స్ లేవు. మరీ ముఖ్యంగా ఐపీఎల్ సీజన్ లో రాహుల్ “గర్ల్ ఫ్రెండ్” సినిమా మాక్ షూట్స్ చేయడం ఆ టైమ్ లో పెద్ద హంగామా సృష్టించింది.

Rahul Ravindran

దాంతో ఈ సినిమా ఏమైందా అని అందరూ అనుకున్నారు. ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు రాహుల్ రవీంద్రన్. “గర్ల్ ఫ్రెండ్” షూటింగ్ కేవలం రెండు రోజులు మాత్రమే మిగిలి ఉందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, నవంబర్ కల్లా ఫస్ట్ కాపీ రెడీ చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్రబృందం. మరి డిసెంబర్ లోగా సినిమాను సమ్మర్ కు విడుదల చేస్తారా అని అడగగా.. అప్పటికి చాలా పెద్ద సినిమాలు క్యూలో ఉన్నాయి.

మేం వాలంటైన్స్ డే రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చాడు రాహుల్. రాహుల్ అనుకున్న ప్రకారం ప్రేమికుల రోజున “గర్ల్ ఫ్రెండ్” సినిమాను రిలీజ్ చేయగలిగితే.. రష్మికకు కేవలం రెండు నెలల్లో రెండు సినిమాలు విడుదల చేసినట్లవుతుంది. ఎందుకంటే.. “యానిమల్” తర్వాత రష్మిక సినిమా ఒక్కటి కూడా విడుదలవ్వలేదు. “పుష్ప 2” డిసెంబర్ 6న విడుదలై, “గర్ల్ ఫ్రెండ్” ఫిబ్రవరి 14న విడుదలైతే గనుక రష్మిక మళ్లీ ఫామ్ లోకి వచ్చేసినట్లే.

అదే విధంగా రాహుల్ రవీంద్రన్ కు కూడా దర్శకుడిగా ఈ సినిమా చాలా కీలకం. ఎందుకంటే.. “చిలసౌ”తో నేషనల్ అవార్డ్ అందుకున్న రాహుల్ కి తదుపరి చిత్రం “మన్మథుడు 2”తో చిన్నపాటి దెబ్బ తిన్నాడు. ఇప్పుడు “గర్ల్ ఫ్రెండ్”తో దర్శకుడిగా తన సత్తా చాటుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

ఓవియా.. లీక్ టైమ్ లో లక్కీ ఛాన్స్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus