Oviya: ఓవియా.. లీక్ టైమ్ లో లక్కీ ఛాన్స్!

తమిళ ఇండస్ట్రీలో సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా బాగా పాపులర్ అయిన నటి ఓవియా (Oviya) , ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. కేరళకు చెందిన ఈ అందాల తార, ప్రధానంగా కోలీవుడ్‌లో కొనసాగుతూనే, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా పలు సినిమాల్లో నటించింది. అన్నీ రకాల ప్రాజెక్టుల్లో నటించినప్పటికీ, స్టార్ హీరోయిన్ స్థాయి గుర్తింపు ఆమెకు రాలేదు. అయితే, తాజాగా ఓవియా మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.

Oviya

కొద్దిరోజుల క్రితం ఓవియాకు (Oviya) సంబంధించిన ఒక ప్రైవేట్ లీక్ వీడియో ఒకటి వైరల్ అయ్యిందని సోషల్ మీడియాలో ఒక టాక్ వైరల్ అయ్యింది. కానీ ఆ తరహా న్యూస్ పై ఆమె పెద్దగా సీరియస్ కాలేదు. తన దృష్టికి వచ్చినా సోషల్ మీడియాలో వీడియో లీక్ అంటూ కామెంట్ పెట్టె వారికి ఎంజాయ్ అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు ఆమె ధైర్యానికి మెచ్చుకుంటుండగా, తమిళ సినీ సెలబ్రిటీల నుంచి కూడా మంచి మద్దతు లభిస్తోంది. నెటిజన్లు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఓవియాతో రాఘవ లారెన్స్ ఒక ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ ఫోటోను ‘కాంచనా 3’ చిత్ర షూటింగ్ సమయంలో తీసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో పోస్ట్ చేయడంతో పాటు మరో ఆసక్తికర వార్త కూడా తెరపైకి వచ్చింది. లారెన్స్ తన సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘కాంచనా’ సిరీస్‌లో 4వ భాగాన్ని త్వరలో సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో ఓవియాను ‘కాంచనా 4’లో హీరోయిన్‌గా తీసుకోబోతున్నారని టాక్ వినిపిస్తోంది. లారెన్స్, ఓవియాతో షేర్ చేసిన ఫోటోను చూసిన అభిమానులు ఆమె పాత్రపై మరింత ఆసక్తి చూపిస్తున్నారు. అంతేకాదు, లారెన్స్ ఇప్పటికే ఓవియాను కన్‌ఫర్మ్ చేశారని కూడా కొన్ని వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ గాసిప్ నిజమైతే, ఓవియాకు పెద్ద బ్రేక్‌గా ‘కాంచనా 4’ నిలవనుంది. అయితే, ఈ వార్తపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

నిర్మాతగా సౌందర్య చేసిన ఈ సినిమా గురించి తెలుసా.. ఏకంగా 2 నేషనల్ అవార్డులు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags