Rajamouli: ఆ సంఘటనతో బాధ పడ్డ రాజమౌళి?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరైన రాజమౌళి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో నెలకొన్న దుర్భర పరిస్థితుల గురించి స్పందిస్తూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కనీస వసతులు కూడా లేవని ట్వీట్ల ద్వారా రాజమౌళి వెల్లడించారు. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నానని ఆర్టీ పీసీఆర్ పరీక్షల కోసం కొన్ని పత్రాలు ఇచ్చి అందులో సమాచారం రాసి ఇవ్వాలని ఎయిర్ పోర్ట్ సిబ్బంది చెప్పారని రాజమౌళి పేర్కొన్నారు.

ఆ పత్రాలను నింపడం కోసం కొందరు ప్రయాణికులు గోడలపై ఆనుకున్నారని మరి కొందరు నేలపై కూర్చుని ఆ పత్రాలను నింపారని రాజమౌళి అన్నారు. అక్కడి పరిస్థితులు చూడటానికి బాగా లేవని కనీసం చిన్న టేబుల్ నైనా ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని రాజమౌళి అభిప్రాయపడ్డారు. ఎయిర్ పోర్ట్ ఎగ్జిట్ గేట్ దగ్గర వీధి కుక్కలు గుంపులుగా ఉన్నాయని దేశ గౌరవానికి కుక్కలు అలా ఉండటం మంచిది కాదని రాజమౌళి పేర్కొన్నారు.

ఇలాంటివి చూస్తే మన దేశంపై విదేశీయులకు ఎలాంటి భావన కలుగుతుందో ఆలోచించాలని రాజమౌళి చెప్పుకొచ్చారు. దయచేసి ఎయిర్ పోర్ట్ లో నెలకొన్న పరిస్థితులపై దృష్టి సారించాలని రాజమౌళి సూచనలు చేశారు. మరోవైపు రాజమౌళి ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ నెలాఖరు నాటికి షూటింగ్ ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా చేయాలని రాజమౌళి భావిస్తున్నట్టు భోగట్టా. అక్టోబర్ 13వ తేదీన ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. ఎయిర్ పోర్ట్ లో నెలకొన్న పరిస్థితుల వల్ల బాధ పడ్డ రాజమౌళి ట్వీట్ల ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus